Cheran: సినిమా సెట్లో పెను ప్రమాదం.. తలకు బలమైన గాయం.. అయినా షూటింగ్ ఆపని నటుడు..
ఇటీవల షూటింగ్ సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పలువురు హీరోలు డూప్ సహయం లేకుండానే యాక్షన్
ఇటీవల షూటింగ్ సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పలువురు హీరోలు డూప్ సహయం లేకుండానే యాక్షన్ సన్నివేశాలను చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్లో రెండు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలలో విశాల్ రెండు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి షూటింగ్స్ స్టార్ట్ చేశారు. తాజాగా మరో నటుడు సైతం షూటింగ్ సెట్లో తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలైన.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా గాయాలతోనే షూటింగ్‌ను పూర్తి చేశాడు.
తమిళంలో డైరెక్టర్ నంద పెరియస్వామి దర్శకత్వంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత, నటుడు, డైరెక్టర్ చేరన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే దిండిగల్ జిల్లాలో ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో చేరన్ ఇంటి పైకప్పు నుంచి కాలు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన చిత్రయూనిట్ ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు 8 కుట్లు పడినట్లుగా సమచారం. అయితే ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న చేరన్.. తన వలన షూటింగ్ ఆగిపోవద్దని ఆసుపత్రి నుంచి నేరుగా షూటింగ్ స్పాట్‌కి వచ్చి చిత్రీకరణంలో పాల్గొన్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.
Also Read: Tokyo Olympics 2021: కాంస్యం కోసం పోరాడి ఓడిన భారత్ అమ్మాయిలు.. బ్రిటన్ 4-3 తేడాతో గెలుపు
Dalit Bandhu: తెలంగాణ దళితబంధు అమలుకు కొత్త మార్గదర్శకాలు.. పథకం అమలు తీరు ఎలా ఉంటుందంటే?