Tokyo Olympics 2021: కాంస్యం పోరులో భారత్ ఓటమి.. తృటిలో చరిత్ర సృష్టించే అవకాశం కోల్పోయిన అమ్మాయిలు
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు కాంస్యం కోసం తన వంతు పోరాటం చేసింది. ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓడిపోయింది.
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు కాంస్యం కోసం తన వంతు పోరాటం చేసింది. ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓడిపోయింది. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది.
బలమైన ప్రత్యర్థి గ్రేట్ బ్రిటన్ ను అన్ని విధాలుగా కట్టడి చేసిన రాణి సేన.. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా మైదానం లో పాదరసంలా కదిలారు. ఓ వైపు స్ట్రైకర్లు..మరోవైపు డిఫెన్స్ టీం చక్కగా రాణించింది. దీంతో భారత్ గెలుపుని సొంతం చేసుకుంది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా కాంస్య పతకం కోసం పోరాడే స్టేజ్ వరకూ చేసుకుంది. పతకం మొదటి క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు.. ఒక్క గోల్ కూడా చేయకుండా సమానంగా ఉన్నాయి. అయితే బ్రిటన్ కు రెండు ఫెనాల్టీ కార్నర్ లు లభించాయి. కానీ భారత్ గోల్ కీపర్ సవిత వాటిని నేర్పుతో గోల్ కాకుండా అడ్డుకుంది. బ్రిటన్ జట్టు వరసగా రెండో గోల్స్ చేసి ఇండియా పై లీడ్ లో ఉన్న సమయంలో భారత్ జట్టు తమ స్ట్రేటజీ మార్చింది. బ్రిటన్ గోల్ పోస్ట్ పై వరస దాడులు చేసి.. వెంట వెంటనే రెండో గోల్స్ చేసింది. రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది.. గుల్జిత్ కౌర్ రెండో గోల్స్ చేసింది.. మూడో గోల్స్ ను వందనా కటారియా చేయడంతో బ్రిటన్ పై 3-2 తో లీడ్ లోకి వచ్చింది. నాలుగో క్వార్టర్ లో బ్రిటన్ నాలుగో గోల్ చేసి టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది.