Tokyo Olympics 2020: రజత పతకం సాధించిన రవి దహియా.. జైలులో భావోద్వేగానికి గురైన సుశీల్ కుమార్
గురువారం (ఆగస్టు 05) జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో జౌర్ ఉగ్యూవ్‌పై రవి దహియా ఆటను చూసి సుశీల్ కుమార్ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
Tokyo Olympics 2021: సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ పోటీల్లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన రెండో భారతీయుడిగా రవి దహియా నిలిచాడు. దహియా రష్యన్ ఒలింపిక్ కమిటీ (ROC) ప్లేయర్‌పై జౌర్ ఉగ్యూవ్ 7-4తో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగం ఫైనల్ బౌట్‌లో ఓడిపోయి రెండోవ స్థానంలో నిలిచాడు. టోక్యోలో తన తొలి ఒలింపిక్స్ ప్రయాణంలో దహియా తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతని పట్టుదలతో సెమీ ఫైనల్‌లో కజకిస్తాన్ ప్లేయర్ నూరిస్లామ్ సానాయేవ్‌పై గెలిచాడు. అంతకుముందు కొలంబియా ప్లేయర్ ఆస్కార్ టిగ్రెరోస్, బల్గేరియన్ ప్లేయర్ జార్జి వంగెలోవ్ లాంటి వాళ్లతో ఆరంభ మ్యాచులు ఆడాడు.
సెమీ-ఫైనల్‌లో ఓడిపోయే దశ నుంచి విజయతీరాలకు చేరుకుని ఆశ్చర్యపరిచాడు. ఒక దశలో దహియా 9-2 తేడాతో వెనుకంజలో ఉన్నా.. ఆట ముగిసే సమయానికి కజఖ్‌ని పంచులతో దెబ్బకొట్టి విజయం సాధించాడు. రవి దహియా ఫైనల్ పోరాటంలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఉగ్యూవ్‌తో తలపడ్డాడు. చివర వరకు పోరాడిని విజయం సాధించలేకపోయాడు.
బంగారు పతకాన్ని సాధించే ప్రయత్నంలో దహియా ఫైనల్‌లో ఉగ్యూవ్‌తో తలపడ్డాడు. అతని గురువు సుశీల్ కుమార్ తీహార్ జైలు నుంచి చూసి, సంతోషడినట్లు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, సుశీల్ కుమార్ ఇతర ఖైదీలతో కలిసి ఫైనల్ పోరును తిలకించాడంట. దహియా పోరును చూసి భావోద్వేగానికి గురయ్యాడంట. కాగా, 2012 లండన్ ఒలింపిక్స్ పోటీల్లో సుశీల్ రికార్డును రవి సమం చేయడంతో భావోద్వేగానికి గురయ్యాడని తెలుస్తోంది. లండన్ గేమ్స్‌లో ఫైనల్లో పోరాడి ఓడిన సుశీల్ కుమార్.. రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. దీంతో రెజ్లింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులను నెలకొల్పాడు. అలాగే సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒలింపిక్స్ పోటీలలో రెండు పతకాలు సాధించిన మొదటి భారత అథ్లెట్‌గా నిలిచాడు.
అయితే, తన ఆరాధ్య దైవం సుశీల్ కుమార్‌లా కాకుండా.. దహియా టోక్యోలో తన తొలి ఒలింపిక్స్ అరంగేట్రంలోనే పతకంతో సత్తా చాటాడు. రవి దహియా.. సుశీల్‌ని తన గురువుగా భావించి, ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో అతనితో శిక్షణ పొందాడు. 2008 ఒలింపిక్స్‌లో సుశీల్ చూపిన పోరాటంతో దహియా కుస్తీని వృత్తిగా స్వీకరించడానికి ప్రేరేపించింది. దీంతో సుశీల్ వద్దే శిక్షణ తీసుకుని నేడు టోక్యోలో పతకం సాధించాడు.
Ravi Kumar Dahiya: భారత్‌కు మరో పథకం.. సిల్వర్ మెడల్ సాధించిన రవి దహియా