Ravi Kumar Dahiya: భారత్‌కు మరో పథకం.. సిల్వర్ మెడల్ సాధించిన రవి దహియా

Ravi Kumar Dahiya: భారత స్టార్‌ రెజ్లర్‌ రవి రజతంతో సరిపెట్టుకున్నాడు. హోరా హోరిగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో

Ravi Kumar Dahiya:  భారత్‌కు మరో పథకం.. సిల్వర్ మెడల్ సాధించిన రవి దహియా
Ravi
Follow us

|

Updated on: Aug 05, 2021 | 5:20 PM

Ravi Kumar Dahiya: భారత స్టార్‌ రెజ్లర్‌ రవి రజతంతో సరిపెట్టుకున్నాడు. హోరా హోరిగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌ చేతిలో 7-4 తేడాతో ఓడిపోయాడు. ఈ ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

ప్రధాని మోదీ ప్రశంసలు..

చివరి వరకు పోరాడి ఓడినా.. రవి కుమార్‌ దేశానికి మరో పతకాన్ని సంపాదించి పెట్టాడు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్‌లో హోరా హోరిగా జరిగిన మ్యాచ్‌లో ఓడిన రవి వెండి పతకాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘రవి కుమార్‌ దహియా అద్భుతమైన ఆటగాడు. అతను కనబరిచిన స్ఫూర్తి అద్భుతం. వెండి పతకం గెలిచుకున్నందుకు రవి కుమార్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

రాహుల్‌ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్‌ ట్వీట్..

భారత ఖాతాలో మరో పతకాన్ని చేర్చిన రవి కుమార్‌ దహియాకు ప్రముఖుల నుంచి ప్రశసంలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా రవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ట్వీట్‌ చేస్తూ రవి దేశానికి గర్వకారణంగా నిలిచాడని ట్వీట్‌ చేశారు.

రవికి హరియాణా సీఎం అభినందనలు.. భారీ నజరానా..

భారత్‌కు రజత పతకం తీసుకొచ్చిన రవి కుమార్‌పై ఆయన సొంత రాష్ట్రమైన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా.. రూ. 4 కోట్ల నగదు, క్లాస్‌ 1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇప్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రవి స్వగ్రామంలో రెజ్లింగ్‌ ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు.