Dalit Bandhu: తెలంగాణ దళితబంధు అమలుకు కొత్త మార్గదర్శకాలు.. పథకం అమలు తీరు ఎలా ఉంటుందంటే?

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తెలంగాణ దళితబంధు పథకం కార్యరూపం దాల్చుతోంది. తొలుత ఈ పథకం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం నుంచే శ్రీకారం.

Dalit Bandhu: తెలంగాణ దళితబంధు అమలుకు కొత్త మార్గదర్శకాలు.. పథకం అమలు తీరు ఎలా ఉంటుందంటే?
Telangana Dalit Bandhu Scheme
Follow us

|

Updated on: Aug 06, 2021 | 8:45 AM

‘Telangana Dalit Bandhu’: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధు పథకం కార్యరూపం దాల్చుతోంది. తొలుత ఈ పథకం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం నుంచే శ్రీకారం చుడుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. అక్కడ 76 కుటుంబాల కోసం రూ.7.6 కోట్లు కలెక్టర్‌ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు నిర్దేశించారు.

సీఎం కేసీఆర్ ప్రకటించిన దళితబంధు పథకం మొదట హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావించారు, అయితే, ముందుగా తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించి పథకం అమలును పర్యవేక్షించనున్నట్టు ప్రకటించింది. కాగా, వాసాలమర్రిలో 76 నిరుపేద దళిత కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌సీసీడీసీ) గురువారం రూ.7.6 కోట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ దళిత బంధు పథకం అమలును పర్యవక్షించనున్నారు. పక్కాగా ఎంపిక చేసిన కుటుంబాలకు నిధులు చేరేలా, వాటిని సద్వినియోగం చేసుకునేలా జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమిస్తున్నారు. కాగా, వాసాలమర్రిలో అమలును పరిశీలించిన తరువాత రాష్ట్ర స్థాయిలో పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, వెనుకబడిన దళిత కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా దళితబంధు పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. తమకు నచ్చిన, అనువైన యూనిట్లను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఇచ్చిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసుకునే యూనిట్లకు సంబంధించి ఎస్‌సీసీడీసీ కొన్ని సలహాలు, సూచనలు చేసింది. వివిధ రంగాల్లో డిమాండ్‌ ఉన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు పలురకాల యూనిట్ల జాబితాలతో ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇవేగాకుండా లబ్ధిదారులు తమకు ఇప్పటికే అవగాహన ఉన్న ఇతర యూనిట్లను కూడా ప్రారంభించుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ నేపథ్యంలోనే మూడు స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన.. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), జెడ్పీ సీఈవో, డీఆర్‌డీఏ, వ్యవసాయ, పశుసంవర్ధక, రవాణా,పరిశ్రమల విభాగాల నుంచి ఎంపిక చేసిన అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీతోపాటు కలెక్టర్‌ నామినేట్‌ చేసే మరో ఇద్దరు కమిటీలో సభ్యులుగా ఉంటారు. మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్ధార్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులతోపాటు ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులతో కమిటీ ఉంటుంది.

ప్రభుత్వం నిర్ధేశించిన కమిటీలే దళిత బంధు పథకం అమలులో కీలకంగా వ్యవహరించనున్నాయి. పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం, డేటాబేస్‌లో అర్హత కలిగిన కుటుంబాల పేర్లు నమోదు చేయడం, జిల్లా కలెక్టర్‌ నుంచి మంజూరు పత్రాల పంపిణీ, లబ్ధిదారులకు శిక్షణ, అవసరమైన వనరుల కూర్పు, సలహాలు, సూచనలి ఇవ్వడం, క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన ఐడీ కార్డుల జారీ, యూనిట్ల పనితీరు పరిశీలన, ఇన్సూరెన్స్‌ కవరేజీ తదితర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. మండల, గ్రామ కమిటీలు లబ్ధిదారులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వారితో చర్చించి.. సమస్యలేమైనా ఉంటే గుర్తించడం, వాటికి పరిష్కారం చూపడం వంటి చర్యలు తీసుకుంటాయి. ఈ సమావేశాలు, చర్చల నివేదికలను డేటాబేస్‌లోకి అప్‌లోడ్‌ చేస్తాయి.

దళిత బంధు పథకం లబ్ధిదారుల రక్షణ కోసం జిల్లాస్థాయిలో దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, పరిశ్రమల విభాగం జనరల్‌ మేనేజర్‌ సభ్యులుగా ఉండే కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది. రూ.10లక్షల సాయం మంజూరైన లబ్ధిదారుల నుంచి రూ.10వేల చొప్పున, ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రూ.10 వేల చొప్పున ‘రక్షణ నిధి’కి కాంట్రిబ్యూషన్‌గా జమ చేస్తారు. దీనితోపాటు లబ్ధిదారులు ఏటా రూ.1,000 చొప్పున నిధికి జమచేయాలి. ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా ఆపదకు లోనైనప్పుడు ఈ నిధి నుంచి సాయం అందిస్తారు.

Read Also…  పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. పులిచింతల నుంచి దిగువకు నీటి విడుదల.. ప్రకాశం బ్యారేజ్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..