Yakshini OTT: ‘అబ్బాయిలు జాగ్రత్త.. యక్షిణి వచ్చేస్తోంది’.. భయపెట్టిస్తోన్నట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యక్షిణి అనే కామ పిశాచి కథల గురించి మనం వినే ఉంటాం.. రాత్రి ఒంటరిగా వెళ్లే మగాళ్లని తన అందచందాలతో వశపర్చుకుని తన కోరిక తీరిన అనంతరం చంపేస్తుంది. ఇదే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు చాలా పుస్తకాలు రాగా.. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రానుంది. 'అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తుంది' అంటూ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్
యక్షిణి అనే కామ పిశాచి కథల గురించి మనం వినే ఉంటాం.. రాత్రి ఒంటరిగా వెళ్లే మగాళ్లని తన అందచందాలతో వశపర్చుకుని తన కోరిక తీరిన అనంతరం చంపేస్తుంది. ఇదే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు చాలా పుస్తకాలు రాగా.. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రానుంది. ‘అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తుంది’ అంటూ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుసగా కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఆ తర్వాత ఇదొక హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని క్లారిటీ ఇవ్వడంతో ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందా? అని ఓటీటీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ తెలుగు హారర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజైంది. అలాగే స్ట్రీమింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. యక్షిణి వెబ్ సిరీస్‌లో మంచు లక్ష‍్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్కా మీడియా వర్క్స్’పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. తేజ మార్ని ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. జూన్ 14 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠి భాషల్లో యక్షిణి స్ట్రీమింగ్ కు రానుంది.
ఇక సిరీస్ కథ విషయానికి వస్తే.. యక్షిణి అనే దేవకన్య శాపానికి గురవుతుంది. దీంతో మనిషిగా భూమ్మీదకు అడుగుపెడుతుంది. 100 మంది యువకుల్ని వశపరుచుకుని చంపితేనే ఆమెకు శాపవిముక్తి కలుగుతుంది. అలా విజయవంతంగా 99 మందిని చంపిన యక్షిణి.. 100వ వాడి విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి యక్షిణికి శాప విముక్తి కలిగిందా? లేదా? చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
Target locked 🔒
Watch the Trailer Now – https://t.co/yo88MBZb75#YakshiniVasthundi Streaming from 14th June in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi, Bangla, Marathi only on #DisneyPlusHotstar@vedhika4u @ActorRahulVijay @LakshmiManchu @UrsAjayRavuri @arkamediaworks… pic.twitter.com/yU85pjMaG7
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 25, 2024
యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.