Varshangalkku Shesham OTT: మరోసారి హృదయం జోడీ రిపీట్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ సూపర్ హిట్ మూవీ..
ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి రివ్యూస్ అందుకుంది. ధ్యాన్, నివిన్ల నటన, వినీత్ దర్శకత్వం పై ప్రశంసలు కురిపించారు అడియన్స్. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా అంతగా కాలెక్ట్ కాలేదు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు 45 రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది.
హృదయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో ప్రణవ్ మోహన్ లాల్.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు వస్తున్నాడు. అదే వర్షంగల్కు శేషం సినిమా. ఇందులో హృదయం మూవీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, YG మహేంద్రన్, షాన్ రెహమాన్, నీతా పిళ్లై, అజు వర్గీస్, బాసిల్ జోసెఫ్, నీరజ్ మాధవ్, వినీత్ శ్రీనివాసన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి రివ్యూస్ అందుకుంది. ధ్యాన్, నివిన్ల నటన, వినీత్ దర్శకత్వం పై ప్రశంసలు కురిపించారు అడియన్స్. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా అంతగా కాలెక్ట్ కాలేదు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు 45 రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది.
80’s సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని అటు తెలుగులోనూ విడుదల చేసే అవకాశముంది. ఈ సినిమాను మెర్రీల్యాండ్ సినిమాస్ బ్యానర్‌పై విశాఖ సుబ్రమణ్యం నిర్మించారు. ఒరిజినల్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సహా ఈ చిత్రానికి సంగీతం కొత్త అమృత్ రామ్‌నాథ్ స్వరపరిచారు. కేరళ, తమిళనాడులోని 50 వేర్వేరు ప్రదేశాలలో షూటింగ్ జరిగింది. థియేట్రికల్‌గా విడుదలైన తొమ్మిది రోజుల తర్వాత మొత్తం రూ.57 కోట్లు రాబట్టింది ఈ సినిమా.
కథ విషయానికి వస్తే.. 80-90’sలో కేరళ. వేణు (ధ్యాన్ శ్రీనివాసన్ )కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసత్కి ఉంటుంది.వీటి ద్వారా సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయం ఏర్పడుతుంది. అతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుందని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజులకు ఇద్దరు కలిసి చెన్నై వెళ్తారు. మురళి ద్వారా వేణుకు దర్శకత్వం ఛాన్స్ వస్తుంది. కానీ కొన్ని కారణాలతో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? చివరకి వీరు ఎలా కలిశారు ? అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.