Rorschach: ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి సూపర్‌ హిట్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

నవంబర్‌ 11 నుంచి మమ్ముట్టి సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు డిస్నీ హాట్‌ స్టార్‌ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

Rorschach: ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి సూపర్‌ హిట్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Mammootty Rorschach
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2022 | 7:10 PM

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం రోస్‌చాక్‌. అక్టోబర్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సస్పెన్స్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. మమ్ముట్టి నటనకు తోడు సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తోన్న ఈ మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ రాస్‌చాక్ డిజిటల్‌ రైట్స్‌ను భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో నవంబర్‌ 11 నుంచి మమ్ముట్టి సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు డిస్నీ హాట్‌ స్టార్‌ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు డిస్నీప్లస్‌ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పాటు రోస్‌చాక్‌ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది.

కాగా మమ్ముట్టి తన సొంత నిర్మాణ సంస్థపై రోస్‌చాక్‌ను నిర్మించాడు. నిశం బషీర్‌ దర్శకత్వం వహించాడు. మిధున్‌ ముకుందన్‌ సంగీతం అందించగా కిరణ్‌ దాస్‌ ఎడిటర్‌గా పని చేశాడు. అసిఫ్‌ అలీ, షరఫ్‌ ఉధీన్‌, గ్రేస్‌ ఆంటోని కీలక పాత్రల్లో నటించారు. ఇక కథ విషయానికొస్తే.. ల్యూక్ ఆంటోని అనే ఎన్‌ఆర్‌ఐ బిజినెస్ మ్యాన్‌ పాత్రలో మమ్ముట్టి నటించాడు. తన కుటుంబంతో సహా దుబాయ్ నుంచి వెకేషన్ కోసం కేరళ‌కు వస్తాడు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో స్పృహ కోల్పోతాడు. మెలకువ వచ్చాక భార్య పక్కన కనిపించదు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పులి బారిన పడి చనిపోయిందని కేసును మూసివేస్తారు? అయితే ల్యూక్‌ సొంతంగా ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభిస్తాడు. మరి కనిపించకుండా పోయిన అతని భార్య చనిపోయిందా? బతికే ఉందా? అని తెలుసుకోవాలంటే రోస్‌చాక్ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..