AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Reddy OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న లవ్ రెడ్డి.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ప్రేమకథను రూపొందించారు.

Love Reddy OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న లవ్ రెడ్డి.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Love Reddy
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2025 | 12:04 PM

Share

ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సినిమా లవ్ రెడ్డి. స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించగా.. గతేడాది అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథ పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అధికారికంగా ప్రకటించారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన రెండున్నర నెలల తర్వాత తెలుగు మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన ఈసినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కథ విషయానికి వస్తే..

ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లోని ఓ పల్లెటూరికి చెందిన నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. అతడికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్ లో దివ్య (శ్రావణి రెడ్డి) అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్ రెడ్డిగా మారి ఆ అమ్మాయే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అయితే ఓరోజు దివ్యకు ప్రపోజ్ చేస్తాడు నారాయణ. దీంతో ఆమె అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అసలు దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది..? నారాయణ నిజంగానే ప్రేమించలేదా..? చివరకు ఇద్దరి ప్రేమకథ ఏం జరిగింది అనేది సినిమా.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.