OTT Movies: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఇవాళ అందుబాటులోకి 20కు పైగా సినిమాలు/ సిరీస్‌లు.. లిస్ట్ ఇదుగో
ప్రస్తుతం అందరి దృష్టి ఆహా 'న్యూసెన్స్' వెబ్ సిరీస్‌పైనే ఉంది. మీడియా రంగంలో సరికొత్త కోణాన్ని చూపిస్తుమున్నామంటూ రిలీజైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేశాయి. అలాగే సోనాక్షి సిన్హా క్రైమ్ థ్రిల్లర్ ధహాడ్, ఐశ్వర్యా రాజేశ్ సొప్పన సుందరి..
వీకెండ్ వస్తే చాలు.. ఈ వారం ఏయే కొత్త సినిమాలు/ వెబ్ సిరీస్‌లు రిలీజవుతున్నాయి? అని మూవీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అలా ఈ వారం థియేటర్లలో కూడా అక్కినేని నాగచైతన్య కస్టడీ, సునీల్ భువన విజయం, బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్, శ్రియ మ్యూజిక్ స్కూల్, ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక వీటికి పోటీగా ఓటీటీల్లో కూడా పెద్ద ఎత్తున సినిమాలు/ వెబ్ సిరీస్‌లు మూవీ లవర్స్‌ను పలకరించనున్నాయి. ఇవాళ (మే12)న రిలీజ్ కావాల్సిన సమంత ‘శాకుంతలం’ చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ప్రస్తుతం అందరి దృష్టి ఆహా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్‌పైనే ఉంది. మీడియా రంగంలో సరికొత్త కోణాన్ని చూపిస్తుమున్నామంటూ రిలీజైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేశాయి. అలాగే సోనాక్షి సిన్హా క్రైమ్ థ్రిల్లర్ ధహాడ్, ఐశ్వర్యా రాజేశ్ సొప్పన సుందరి వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లోని సినిమాలు/ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరి ఇవాళ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు/ సిరీస్‌లేవో ఒక లుక్కేద్దాం రండి.
ఆహా
- న్యూసెన్స్ – తెలుగు వెబ్ సిరీస్
- దాస్ కా ధమ్కీ (తమిళ్)
నెట్ ఫ్లిక్స్
- బ్లాక్ నైట్ – కొరియన్ సిరీస్
- క్వీర్ ఐ సీజన్ 7 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
- ద మదర్ – ఇంగ్లిష్ సినిమా
- తిరువిన్ కురళ్ – తమిళ్ సినిమా
- అరిని బై లవ్.inc – ఇండోనేసియన్ మూవీ
- వన్ నైట్ స్టాండ్ – ఇండోనేసియన్ సినిమా
- రాయల్ టీన్: ప్రిన్సెన్స్ మార్గరెట్ – ఇంగ్లిష్ మూవీ
- మల్లిగన్ – వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్
- ఎయిర్ – ఇంగ్లిష్ మూవీ
- దహాద్ – హిందీ సిరీస్
- యతిసాయ్ – తమిళ సినిమా
- శాకుంతలం – తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది)
- భోలా – హిందీ మూవీ
- విచిత్రం (మలయాళం సినిమా)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- సొప్పన సుందరి – తెలుగు డబ్బింగ్ సినిమా
- క్రాటర్ – ఇంగ్లిష్ సినిమా
జీ5
- తాజ్: ర్యాన్ ఆఫ్ రివేంజ్ – హిందీ సిరీస్
సోనీ లివ్
- ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్ – ఇంగ్లిష్ సినిమా
జియో సినిమా:
- విక్రమ్ వేద – హిందీ మూవీ
లయన్స్ గేట్ ప్లే:
- లాస్ట్ షూట్ ఔట్ (ఇంగ్లిష్ సినిమా)
- జాన్ రాంబో (ఇంగ్లిష్ మూవీ)
- గన్స్ అకింబో (ఇంగ్లిష్ సినిమా)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.