War 2 OTT: ఎట్టకేలకు ఓటీటీలో ‘వార్ 2’.. ఎన్టీఆర్, హృతిక్‌ల స్పై యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన చిత్రం వార్ 2. ఈ ఏడాది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన వార్ 2 సూపర్ హిట్ గా నిలిచింది. అభిమానుల అంచనాలు అందుకోలేనప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారక్ , హృతిక్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన వార్ 2 సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలో వీరి నిరీక్షణకు తెరపడనుంది. వార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజయ్యాక 8 వారాల తర్వాతే వార్ 2 సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ముందుగానే డీల్ జరిగిందని టాక్. అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. అయితే ఇప్పుడు 8 వారాల గడువు పూర్తయిందని త్వరలోనే వార్ 2 సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. దసరా పండగ కానుకగా అక్టోబర్ 01 నుంచి ఎన్టీఆర్, హృతిక్ ల మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని తెలుస్తోంది. ఒక వేళ ఈ డేట్ కు రాకపోయినా అక్టోబర్ 9 నుంచి వార్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. ఒకే రోజు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
The #War2 Will Be Available In Netflix From October 9th ❤️🔥.@tarak9999 @iHrithik pic.twitter.com/YgnkfD9Pb0
ఇవి కూడా చదవండి— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) September 28, 2025
#War2 OTT Release:
The streaming rights are reportedly with Netflix, and the buzz is that the movie could be available on OTT from October 9, 2025, in Hindi, Telugu, and other languages.
Nothing has been officially confirmed yet. pic.twitter.com/o3DM2jhoGF
— MOHIT_R.C (@Mohit_RC_91) September 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








