Dayaa: ఓటీటీలో మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌.. జేడీ, ఇషాల ‘దయా’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

నవదీప్‌, ఆది సాయికుమార్‌ వంటి యంగ్‌ హీరోలు ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్‌ హీరో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. ఆయనే టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవరి. దయా అనే ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌తో త్వరలోనే ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించనున్నారాయన

Dayaa: ఓటీటీలో మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌.. జేడీ, ఇషాల 'దయా' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Dayaa Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2023 | 2:50 PM

ఇటీవల కాలంలో ఓటీటీ వెబ్‌సిరీస్‌లకు ఆదరణ బాగా పెరిగింది. సినిమాలతో పాటు సిరీస్‌లకు కూడా రికార్డు స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి. ఓటీటీలకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్‌ హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్‌ బాట పడుతున్నారు. ఇప్పటికే నవదీప్‌, ఆది సాయికుమార్‌ వంటి యంగ్‌ హీరోలు ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్‌ హీరో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. ఆయనే టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవరి. దయా అనే ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌తో త్వరలోనే ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించనున్నారాయన. తెలుగమ్మాయ ఇషా రెబ్బా, యాంకర్‌ విష్ణుప్రియ, రమ్యనంబీసన్‌, జోష్‌ రవి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన ఈ క్రైమ్‌ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 4 నుంచి దయా సిరీస్‌ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

తాజాగా దయా వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. ‘ఒక అడవి.. అందులో ఎన్నో ప్రాణులు.. కానీ కొన్ని గుంట నక్కలు వాటి మీద దారుణంగా విరుచుకుపడుతున్నాయి’ అంటూ రేప్‌ సీన్లతో ట్రైలర్‌ స్టార్ట్ అవుతుంది. ఆతర్వాత లేడీ రిపోర్టర్‌ మిస్‌ కావడం, వ్యాన్‌ డ్రైవర్‌గా జేడీ ఎంట్రీ ఇవ్వడం.. ఇలా ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలు, సస్పెన్స్‌ అంశాలతో ట్రైలర్‌ సాగింది. ట్రైలర్‌ చూస్తుంటే పక్కా క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌ సిరీస్‌ అని అర్థమవుతుంది. ఇటీవల క్రైమ్‌ అండ్‌ థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లకు ఓటీటీలో పెద్ద ఎత్తన ఆదరణ లభిస్తుండడంతో దయా కూడా సూపర్‌ హిట్‌ అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..