Agent Movie OTT: ‘ఏజెంట్’ ఓటీటీ మళ్లీ వాయిదా ?.. మళ్లీ నిరాశేనా..
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై మాత్రం క్యూరియాసిటి నెలకొంది. ఎందుకంటే ఈ మూవీ విడుదలై రెండు నెలలు పూర్తైనా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఏజెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ముందుగా ఈ సినిమాను మే19న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు.

అక్కినేని అఖిల్ నటించిన లేటేస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే భారీ హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాపు అయ్యింది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై మాత్రం క్యూరియాసిటి నెలకొంది. ఎందుకంటే ఈ మూవీ విడుదలై రెండు నెలలు పూర్తైనా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఏజెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ముందుగా ఈ సినిమాను మే19న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు.
ఇక ఇప్పుడు జూన్ 23న స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరోసారి స్ట్రీమింగ్ వాయిదా పడిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీకి అనుకూలంగా ఉండేలా సినిమాలోని కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏజెంట్ ఓటీటీ మరోసారి వాయిదా వేయనున్నారని సమాచారం. మరీ ఈ వార్తలలో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాల్సి ఉంది.




ఇదిలా ఉండే.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో వచ్చిన చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి నిరాశే ఎదురయ్యింది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేయగా.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్ పూర్తి మార్చేసి సాహసం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితం రాలేకపోయింది.