AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ardhamayyindha Arun Kumar: ఆహాలో రానున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్’ట్రైలర్

జూన్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా, ఆలోచింప‌చేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువ‌కుడు కార్పొరేట్ ప్ర‌పంచంలో ఇంట‌ర్న్‌గా ప్ర‌యాణం చేసే క్ర‌మంలో త‌నకు ఎద‌ర‌య్యే అనేక అనుభ‌వాల‌ను ఇందులో చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

Ardhamayyindha Arun Kumar:  ఆహాలో రానున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్’ట్రైలర్
ardhamandaa arun kumar
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2023 | 12:55 PM

Share

ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవితంలో ఏదో సాధించాల‌నే ల‌క్ష్యంతో ఓ చిన్న ప‌ట్ట‌ణ ప్రాంతం నుంచి మ‌హా న‌గ‌రంలోకి ఇంట‌ర్న్‌షిప్ ఉద్యోగిగా అడుగు పెట్టిన అరుణ్ కుమార్ అనే యువ‌కుడి క‌థ‌. జ‌ర్నీలో త‌ను ఎదుర్కొన్న ఒడిదొడుకులు, వాటి నుంచి త‌ను నేర్చుకున్న పాఠాలు, కొర్పొరేట్ ప్ర‌పంచంలో ఎలా ముందుకు సాగాడ‌నే అంశాల‌తో రూపొందిన వెబ్ ఒరిజిన‌ల్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’. జూన్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా, ఆలోచింప‌చేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువ‌కుడు కార్పొరేట్ ప్ర‌పంచంలో ఇంట‌ర్న్‌గా ప్ర‌యాణం చేసే క్ర‌మంలో త‌నకు ఎద‌ర‌య్యే అనేక అనుభ‌వాల‌ను ఇందులో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. అందులో ప్రేమ‌, క‌ష్ట‌న‌ష్టాలతో పాటు ఏదో సాధించాల‌నుకునే ఆ యువ‌కుడు స‌వాళ్ల‌ను ఎదుర్కొని త‌న‌దైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడ‌నే విష‌యాల‌ను ఇందులో చ‌క్క‌గా చూపించారు. ఇన్ని అంశాల మేళ‌వింపుగా రూపొందిన ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ జూన్ 30 నుంచి ప్రేక్షకులను మెప్పించనుంది.

అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ రూపొందింది. హ‌ర్షిత్ రెడ్డి, అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌డివాడ త‌దిత‌రులు త‌మ‌దైన న‌ట‌న‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. దీని కార‌ణంగా ఈ కార్పొరేట్ డ్రామాలో ఓ కొత్త అనుభూతి క‌లుగుతుంది.

ట్రైలర్ లాంచ్ ముఖ్య అతిథి, యాక్టర్ ప్రియదర్శి, మాట్లాడుతూ ‘‘ఆహాలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశం. బ‌య‌ట‌కు ఎంతో అందంగా క‌నిపించే కార్పొరేట్ ప్ర‌పంచం ఎలా ఉంటుంది. ఎదో సాధించాల‌నే ల‌క్ష్యంతో ఎంతో మంది యువ‌కులు ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగు పెడ‌తారు. అయితే వారికి ఎదుర‌య్యే స‌వాళ్లు.. వాటిని ఎలా అధిగ‌మించాల‌నే విష‌యాల‌ను ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. త‌ప్ప‌కుండా వెబ్ సిరీస్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది” అన్నారు.

Follow Us