Dear OTT: భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం డియర్. భార్య గురక పెడితే భర్త పడే కష్టాలను ఇందులో ఫన్నీగా చూపించారు. అయితే గతంలో ఇదే కాన్సెప్ట్ తో గుడ్ నైట్ అనే సినిమా రావడం, డియర్ సినిమాకు దీనికి పోలిక రావడంతో ఏప్రిల్ 11న రిలీజైన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం డియర్. భార్య గురక పెడితే భర్త పడే కష్టాలను ఇందులో ఫన్నీగా చూపించారు. అయితే గతంలో ఇదే కాన్సెప్ట్ తో గుడ్ నైట్ అనే సినిమా రావడం, డియర్ సినిమాకు దీనికి పోలిక రావడంతో ఏప్రిల్ 11న రిలీజైన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఒక్క రోజు గ్యాప్ లో అంటే ఏప్రిల్ 12న తెలుగులోనూ డియర్ మూవీ రిలీజైంది. అయితే ఇక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చిత్ర బృందం ప్రమోషన్ల కోసం బాగానే కష్ట పడినా మోస్తరు వసూళ్లకే పరిమితమైంది. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న డియర్ మూవీ అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ డియర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఏప్రిల్ 28) నుంచే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన 17 రోజుల్లోనే ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్అవుతోంది.
ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించిన డియర్ సినిమాలో వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్‍తో పాటు కాళీ వెంకట్, రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందించాడు జీవీ ప్రకాశ్ కుమార్. నట్‍మెగ్ ప్రొడక్షన్స్, రోమియో పిక్చర్స్ పతాకాలపై వరుణ్ త్రిపురణేని, అభిషేక్ రామిశెట్టి, పృథ్విరాజ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. వీకెండ్ లో ఓ మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకుంటున్నారా? అయితే డియర్ సినిమా మీకు మంచి ఛాయిస్.. ఓ లుక్కేయండి మరి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న డియర్..
Tamil Film #DeAr (Hindi) Now streaming on @NetflixIndia
Also in Telugu, Kannada & Malayalam languages.
It’s @gvprakash & @aishu_dil Film.#GVPrakash #AishwaryaRajesh @Anand_Rchandran @NutmegProd @tvaroon #DeArOnNetflix pic.twitter.com/AoGOJ8jnrt
— OTT Cinema Movies series Updates (@cinema_abhi) April 28, 2024
#DeAr Now Streaming on @Netflix@gvprakash @aishu_dil Directed by @Anand_Rchandran Produced by @NutmegProd #OTT_Trackers pic.twitter.com/ecE30zQbHC
— OTT Trackers (@OTT_Trackers) April 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.