AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : అడవిలో హత్యలు.. క్షణ క్షణం ఉత్కంఠ.. సస్పెన్స్, ట్విస్టులతో మెంటలెక్కించే సిరీస్..

2025 సంవత్సరంలో విడుదలైన ఒక సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే జనాలకు ఇది మంచి ఎంపిక. సస్పెన్స్ మొదటి నిమిషం నుంచి ప్రారంభమై చివరి వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్ క్లైమాక్స్ మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది.

Cinema : అడవిలో హత్యలు.. క్షణ క్షణం ఉత్కంఠ.. సస్పెన్స్, ట్విస్టులతో మెంటలెక్కించే సిరీస్..
Janaawar
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2025 | 7:40 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తుంది. ఇందులో ఉత్కంఠ మొదటి నిమిషం నుండి ప్రారంభమవుతుంది. ఆరవ ఎపిసోడ్ దారుణమైన మలుపు తిరుగుతుంది. అప్పుడే ఒక షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ 2025లో వచ్చిన “జనవర్: ది బీస్ట్ వితిన్”. ఈ సిరీస్ ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇక్కడ యుగాల నాటి సామాజిక ఆచారాలు, కుల వివక్షత, నేరాలను చూపించారు. ఇందులో భువన్ అరోరా సబ్-ఇన్‌స్పెక్టర్ హేమంత్ కుమార్ పాత్రను పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

కథ విషయానికి వస్తే.. అడవిలో కుళ్ళిపోయిన శవం దొరకడంతో ప్రారంభమవుతుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ కేసును SI హేమంత్ కుమార్‌కు అప్పగిస్తారు. పోలీసులు శవం నుండి ఒక్క క్షణం దూరంగా వెళ్ళినప్పుడు, దాని తల అదృశ్యమవుతుంది. హేమంత్ కుమార్ తన భార్య గర్భవతి కాబట్టి మరుసటి రోజు సెలవుపై వెళ్లాల్సి ఉంది. అయితే, అడవిలో తల లేని మృతదేహం దొరికిన కేసు కారణంగా అతని సెలవు రద్దు అవుతుంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడని తెలుస్తుంది. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే అతనిని కనుగొనమని ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెస్తాడు. మొత్తం ఏఢు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ప్రతి ఎపిసోడ్ మలుపులతో సాగుతుంది. ఇందులో వినోద్ సూర్యవంశీ, ఇషికా డే, భగవాన్ తివారీ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ కు సచింద్ర వాట్స్ దర్శకత్వం వహించారు. భువన్ అరోరా నటించిన “జాన్వార్” సిరీస్ IMDb లో 7.4 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే