Dance Ikon-Aha: ఆహాలో ‘డాన్స్ ఐకాన్’.. జడ్జీగా రాబోతున్న లేడీ సూపర్ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఈ షో ద్వారా రమ్యకృష్ణ డిజిటిల్ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ షో సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా.
ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఇతర ఓటీటీ ప్లాట్ ఫాంలకు గట్టి పోటీనిస్తుంది ఆహా. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‌లను సినీ ప్రియులకు అందించింది. అలాగే గేమ్ షోస్. టాక్ షో.. సింగింగ్ షోలను ఓటీటీ ప్రియులకు పరిచయం చేసిన ఆహా.. ఇక ఇప్పుడు డాన్స్ షోను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ యాంకర్ ఓంకార్..వ్యాఖ్యతగా డాన్స్ ఐకాన్ పేరుతో ఈ షోను ప్రారంభం కాబోతుంది. ఈ షోకు న్యాయనిర్ణేతగా లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ జడ్జీగా వ్యవహరించబోతున్నారు. ఈ షో ద్వారా రమ్యకృష్ణ డిజిటిల్ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ షో సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా.
ఇక ఈ షోలో మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ ఉండనున్నారు. వీరిని ఆక్షన్ ద్వారా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కొనుగోలు చేయనున్నారు. గీతా ఆర్ట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్‌ను వారి టీంలలో చేర్చుకుంటారు. ఇక వీరిని కో ఓనర్స్ గా ఉన్న శ్రీముఖి, యాష్, మోనాల్ గజ్జర్ మెంటర్స్ గా ఉండి ట్రేన్ చేస్తారు. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో కొరియోగ్రాఫర్ ఉంటారు. ఈ షోలో మరో స్పెషాలిటీ ఏంటంటే.. గెలిచిన కంటెస్టెంట్ తరపు కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరోకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పించనున్నారు. ఇక ఈషోకు రమ్యకృష్ణతోపాటు డాన్స్ మాస్టర్ శేఖర్ జడ్జీగా ఉండనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది.
Mamulga undadhu mari! Extra energetic performances & mundhu eppudu lenantha extra entertainment tho, mee kosam oka GRAND Gala Episode!
Don’t miss #DanceIkonOnAHA Grand Gala episode – Premieres September 11, 7 pm.
▶️ https://t.co/V7kKZ3JmvR@TheDeverakonda @ananyapandayy pic.twitter.com/eEH18iStmA
— ahavideoin (@ahavideoIN) September 4, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.