- Telugu News Entertainment Ott Comedy King Brahmanandam was the chief guest on Telugu Indian Idol Season 4 on Aha OTT
Telugu Indian Idol S4: తెలుగు ఇండియన్ ఐడల్ షోలో హాస్య బ్రహ్మ.. సింగర్స్‌తో కలిసి సందడి చేసిన బ్రహ్మానందం.. ఫోటోస్ ..
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా.. నిత్యం సినీప్రియుల ముందుకు కొత్త కంటెంట్ తీసుకువస్తుంది. ఒకవైపు సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా..మరోవైపు ఇంట్రెస్టింగ్ గేమ్ షోస్, టాక్ షోలతోపాటు సింగింగ్, డ్యాన్స్ షోస్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సంగీత ప్రియులకు ఇష్టమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది.
Updated on: Oct 14, 2025 | 5:14 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఎప్పుడూ ముందుంటుంది. సూపర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు, అదిరిపోయే గేమ్ షోలతో సినీప్రియులను అలరిస్తుంది. ఇక సింగింగ్ టాలెంట్ ఉన్న గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో ఓ సింగింగ్ షోను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఈ షో విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన నాలుగో సీజన్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీస్ ఈ షోలో సందడి చేశారు. ఇక ఇప్పుడు మరో ముఖ్య అతిథి ఈ తెలుగు సింగింగ్ షోలో సందడి చేసి గాయనీగాయకులకు మద్దతు తెలిపారు.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో సందిడ చేశారు. తనదైన శైలీలో నవ్వుల విందు చేశారు. అలాగే సింగింగ్ షోలో పాల్గొంటున్న గాయనీగాయకులకు మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ అక్టోబర్ 17, 18 తేదీల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బ్రహ్మానందం వచ్చిన ఎపిసోడ్ ఫోటోస్ రిలీజ్ చేసింది ఆహా.

ఈషోకు సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు ఇండియన్ ఐడల్.. ఇప్పుడు మరికొంతమంది ప్రతిభగల యువతీయువకులకు అద్భుతమైన అవకాశాన్ని కలిగించింది.

ఇక ఈ షో ద్వారా చాలా మంది కొత్త సింగర్స్ కు అవకాశాలు కల్పించారు తమన్. ఇక ఇప్పుడు కామెడీ కింగ్ బ్రహ్మానందం తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొని తనదైన శైలీలో అలరించారు. బ్రహ్మానందంకు సంబంధించిన ఎపిసోడ్ ఈనెల 17,18 తేదీల్లో ఆహా ఓటీటీలో చూడొచ్చు.




