Yatra 2 OTT: యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ వచ్చేసిందోచ్.. సీఎం జగన్ బయోపిక్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 సినిమాకు డీసెంట్‌ టాక్ లభించింద. తెలంగాణలో కొద్దిగా నిరాశపర్చినా ఏపీలో మాత్రం వసూళ్లు బాగానే వచ్చాయి. ఎలాంటి వివాదాస్పద అంశాలకు తావివ్వకుండా సీఎం జగన్ జీవితంలోని కీలక ఘట్టాలను స్పృశిస్తూ మహి. వి. రాఘవ్ యాత్ర 2 ను తెరకెక్కించిన విధానం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరు హిట్ గా నిలిచిన యాత్ర2 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వచ్చేందుకు సిద్ధమైంది.

Yatra 2 OTT: యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ వచ్చేసిందోచ్.. సీఎం జగన్  బయోపిక్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Yatra 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2024 | 2:50 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన సినిమా యాత్ర2. పొలిటికల్‌ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీలో సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా కనిపించాడు. అలాగే జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కనిపించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 సినిమాకు డీసెంట్‌ టాక్ లభించింద. తెలంగాణలో కొద్దిగా నిరాశపర్చినా ఏపీలో మాత్రం వసూళ్లు బాగానే వచ్చాయి. ఎలాంటి వివాదాస్పద అంశాలకు తావివ్వకుండా సీఎం జగన్ జీవితంలోని కీలక ఘట్టాలను స్పృశిస్తూ మహి. వి. రాఘవ్ యాత్ర 2 ను తెరకెక్కించిన విధానం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరు హిట్ గా నిలిచిన యాత్ర2 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఈ బయోపిక్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత యాత్ర 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో మార్చి 8వ నుంచి యాత్ర 2 సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన యాత్ర 2 లో సీఎం జగన్ వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారాయణన్ నటించింది. అలాగే చంద్రబాబు పాత్రలో మహేశ్ మంజ్రేకర్ నటించి మెప్పించారు. సోనియా రోల్‌లో సుజానే బెర్నెట్‌, శుభలేఖ సుధాకర్‌, జార్జ్ మరియన్‌, రాజీవ్‌ కుమార్ అనేజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. మధి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్‌ గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

యాత్ర 2 సినిమా మేకింగ్ వీడియో..

యాత్ర 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.