My Name is Shruthi OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న హాన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
హాన్సిక.. హిందీ పరిశ్రమలో చైల్ట్ ఆర్టిస్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. 2019లో సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ సినిమాలో చివరగా కనిపించింది. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లకు మై నేమ్ ఈజ్ శ్రుతి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది హాన్సిక. దేశముదురు సినిమాతో కథానాయికగా పరిచయమై ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా గడిపేసింది. కానీ తర్వాత అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ పామ్ లో రాణిస్తుంది. రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన క్రేమ్ థ్రిల్లర్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆహాలోనూ స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. స్కిన్ మాఫియా అనే కొత్త పాయింట్ ఆధారంగా ఈ మూవీని మరింత ఆసక్తిగా తెరకెక్కించాడు. గతేడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో అటు కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. థియేటర్లలో సందడి చేసిన మూడు నెలలకు ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది.
హాన్సిక.. హిందీ పరిశ్రమలో చైల్ట్ ఆర్టిస్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. 2019లో సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ సినిమాలో చివరగా కనిపించింది. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లకు మై నేమ్ ఈజ్ శ్రుతి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
కథ విషయానికి వస్తే.. ఓ యాడ్ ఏజెన్సీలో పనచేసే హాన్సిక.. చరణ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని కలలు కంటుంది. కానీ ఓ రోజు హాన్సిక ప్లాట్ లో అను అమ్మాయి డెడ్ బాడీ దొరుకుంది. ఆ ఘటనతో సాఫీగా సాగుతున్న హాన్సిక జీవితం మలుపు తిరుగుతుంది. హన్సికను చంపేందుకు ఓ ఎమ్మెల్యే ట్రై చేస్తుంటాడు. అయితే హాన్సికను ఆ ఎమ్మెల్యే ఎందుకు చంపాలనుకుంటున్నాడు ?.. స్కిన్ మాఫియా గుట్టు బయటపెట్టేందుకు హాన్సిక సాగించిన పోరాటం గురించి ఈ మూవీ.
When intelligence is injected with crime!🦹🏻♀️ ‘My Name is శృతి’ Coming on aha..👉 February 28th. #MyNameIsShruthi #MyNameIsShruthiOnAha @ihansika @Rahulsipligunj @srinivasomkar6 @iamMarkKRobin @kishoreboyidapu @ChotaKPrasad @IsShruthi @vaishnaviarts22 @Poojaram22 @kk_lyricist pic.twitter.com/koduOqPApf
— ahavideoin (@ahavideoIN) February 26, 2024
కోసం ఇక్కడ క్లిక్ చేయండి.