Ambajipeta Marriage Band OTT: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్..
ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి మంచి హిట్ కొట్టాడు. ఇక కొద్ది రోజుల క్రితం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ఈ చిత్రానికి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరోసారి సుహాస్ ఖాతాలో విజయాన్ని అందించిన సినిమా ఇది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నవతరం కథానాయకులలో సుహాస్ ఒకరు. ‘కలర్ ఫోటో’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత సుహాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నాడు. ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి మంచి హిట్ కొట్టాడు. ఇక కొద్ది రోజుల క్రితం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ఈ చిత్రానికి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరోసారి సుహాస్ ఖాతాలో విజయాన్ని అందించిన సినిమా ఇది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ. 8కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ లాభాలు రాబట్టినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది ఈ చిత్రం.
కొద్ది రోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి నెలకొంది. థియేటర్లలో అలరించిన ఈ మూవీ డిజిటల్ స్క్రీన్ పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సుహాస్‍తో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమాలో సుహాస్ సరసన శివాని నాగరం కథానాయికగా నటించింది. అలాగే శరణ్య ప్రదీప్ కీలకపాత్ర పోషించింది.
కథ విషయానికి వస్తే.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ఉండే సుహాస్.. తన అక్క శరణ్య ప్రదీప్ తో కలిసి చిరతపూడిలో నివసిస్తుంటాడు. ఆ ఊరిలో ఉండే నితిన్ ప్రసన్న వల్లే తన అక్కకు ఉద్యోగం వచ్చిందంటూ రూమర్స్ వినిపిస్తుంటాయి. అదే సమయంలో నితిన్ ప్రసన్న చెల్లెలు శివాని నాగారంతో సుహాస్ ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమకు ఎదురైన సవాళ్లేంటీ ?.. తన అక్క పై వచ్చిన పుకార్లను సుహాస్ ఎలా ఎదుర్కొన్నాడు ? అనేది ఈ సినిమా.
March 1st nunchi Aha lo Malligaadi dappula motha!#AmbajipetMarriageBand premieres on Aha from March 1st.#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra @ashishtejapuala @GA2Official @Mahayana_MP @SonyMusicSouth pic.twitter.com/tR2tuUPBCc
— ahavideoin (@ahavideoIN) February 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.