Thangalaan OTT: తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆరోజు నుంచే విక్రమ్ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. 'కబాలి', 'కాలా', 'సర్పత్త పరంబరై' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. చియాన్ విక్రమ్‌ తో పాటు పార్వతి తిరువొత్తు, మాళవికా మోహనన్ తదితర స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటించారు.

Thangalaan OTT: తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆరోజు నుంచే విక్రమ్ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్
Thangalaan Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2024 | 11:27 AM

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పత్త పరంబరై’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. చియాన్ విక్రమ్‌ తో పాటు పార్వతి తిరువొత్తు, మాళవికా మోహనన్ తదితర స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఆగష్టు 15న విడుదల అయిన తంగలాన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో భారీగా కలెక్షన్లు వచ్చాయి. తమిళంలో ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే దక్కాయి. దక్షిణాదిన సూపర్ హిట్ కావడంతో కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ లోనూ విక్రమ్ సినిమా రిలీజైంది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న తంగలాన్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్‌ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే కోట్లు ఖర్చు పెట్టి డీల్‌ సెట్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20 నుంచి తంగలాన్ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ కూడా ప్రకటించినట్లు నెట్టింట ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ, నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో తంగలాన్‌ ఓటీటీ గురించి ఎలాంటి సమాచారం లేదు.

ప్రస్తుతానికి ఇది రూమర్ అయినప్పటికీ సెప్టెంబర్ 20 నుంచే తంగలాన్ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఆ రోజే తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ కానుంద. అయితే హిందీలో మాత్రం ఒక వారం ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 27న విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తంగలాన్ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. 1850 ప్రాంతంలో జరిగే కథాంశంతో ‘తంగళాన్‌’ సినిమాను తెరకెక్కించారు. గిరిజనులను ఉపయోగించుకుని బ్రిటిష్ వారు బంగారాన్ని కొల్లగొట్టడం మెయిన్ పాయింట్ గా ఉన్నప్పటికీ అప్పటి కులతత్వం, వర్ణ వ్యవస్థ, గిరిజనుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, బ్రిటీష్ వారి దురాగతాలను అంతర్లీనంగా చక్కగా చూపించారు డైరెక్టర్ పా. రంజిత్.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 20 నుంచి తంగలాన్ స్ట్రీమింగ్..

తంగలాన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!