AAY OTT : సినిమా చూస్తున్నంతసేపూ నవ్వులే నవ్వులు.. ఓటీటీలోకి ఆయ్.. ఎక్కడ చూడొచ్చంటే

మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు ఆయ్ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు.

AAY OTT : సినిమా చూస్తున్నంతసేపూ నవ్వులే నవ్వులు.. ఓటీటీలోకి ఆయ్.. ఎక్కడ చూడొచ్చంటే
Aay
Follow us

|

Updated on: Sep 10, 2024 | 1:07 PM

కొత్త సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ ఆయన సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన మూవీస్ ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. మంచి వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమానే ఆయ్. మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్.. ఇటీవలే ఆయ్ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు. ఆగస్టు 15న ఆయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రానుంది ఈ సూపర్ హిట్ కామెడీ మూవీ.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆయ్ సినిమా మంచి విజయం సాధించింది. రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోయింది ఈ సినిమా. ఆయ్ ఫైనల్‌గా ఏకంగా రూ.14 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈసినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 12 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కార్తీక్ (నార్నే నితిన్) కరోనా లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఊరికి వచ్చేస్తాడు. అతను విషయం తెలిసి ఫ్రెండ్స్ హరి (అంకిత్ కొయ్య), సుబ్బు (కసిరాజు) కూడా ఊరికి  వచ్చేస్తారు. చిన్నప్పటి నుంచి తన స్నేహితుల కారణంగా నానా తిప్పలు పడ్డ కార్తీక్.. వాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు. అదే సమయంలో ఊళ్ళో పల్లవి (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే అదే అమ్మాయిని  కార్తీక్ ఫ్రెండ్ సుబ్బు చాలా ఏళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ పల్లవి మాత్రం కార్తిక్‌ను ప్రేమిస్తుంది.. కానీ కులం వేరు అనే కారణంతో తండ్రి  చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? కార్తీక్ బాధను తీర్చేందుకు అతని తండ్రి ఏం చేస్తాడు.? ఫ్రెండ్స్ ఏం చేశారు.? అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఫుల్ ఫన్ రైడ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.