Cobra: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టనున్న విక్రమ్ కోబ్రా! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Cobra Ott Release: కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మృణాళిని రవి, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు.
Cobra Ott Release: కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మృణాళిని రవి, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఎప్పటిలాగే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో చియాన్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడలేని వారు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో కోబ్రా డిజిటల్ ప్రీమియర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కాగా కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 లేదా 30న స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేయనున్నారట. కోబ్రా చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు. ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇందులోని అధీరా పాట యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. మరి థియేటర్లలో కోబ్రా విన్యాసాలను చూడలేని వారు ఎంచెక్కా ఇంట్లోనే కూర్చొని ఆస్వాదించండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..