Tollywood Movies: ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో..ఓటీటీలో రాబోయే చిత్రాలు ఇవే..
తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవెంటో తెలుసుకుందామా.
సినీప్రియులకు ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. థియేటర్లలో.. ఓటీటీలలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్ర హావా కొనసాగుతుండగా.. ఇక ఇప్పుడు సెప్టెంబర్ రెండవ వారంలో చిన్న సినిమాల జోరు కొనసాగనుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవెంటో తెలుసుకుందామా.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఇందులో కిరణ్ సరసన సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. డైరెక్టర్శ్ శ్రీధర్ గాదె రూపొందిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తిగా ఉండగా.. సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది.
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. డైరెక్ట్ర మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
కొరియన్ సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ చిత్రానికి రీమేక్‌గా వస్తోన్న సినిమా శాకిని ఢాకిని. నివేదా థామస్.. రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా శాకినీ ఢాకిని. డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కాబోతుంది.
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న సినిమా సకల.. గుణాభిరామ. ఇందులో అషిమా నర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. అలాగే నేను కేరాఫ్ నువ్వు.. కే3 సినిమాలు సెప్టెంబర్ 16న.. ముత్తు మూవీ సెప్టెంబర్ 15న విడుదల కానున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. అమెజాన్ ప్రైమ్ .. విరుమాన్ సినిమా.. సెప్టెంబర్ 11న స్ట్రీమింగ్. నెట్ ఫ్లిక్స్.. జోగి.. హిందీ.. సెప్టెంబర్ 16న స్ట్రీమింగ్. ఆహా.. డ్యాన్స్ ఐకాన్.. సెప్టెంబర్ 11 సోనీలివ్.. రామరావు ఆన్ డ్యూటీ.. కాలేజీ రొమాన్స్. సెప్టెంబర్ 15 డిస్నీప్లస్ హాట్ స్టార్.. విక్రాంత్ రోణ.. సెప్టెంబర్ 16 దహన్.. సెప్టెంబర్ 16