Pushpa Hindi: నార్త్‌లో దూసుకుపోతున్న పుష్ప.. ఓటీటీలోకి హిందీ వెర్షన్.. ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ ఊర మాస్ లుక్‌లో పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టాడు. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ పుష్ప దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హిందీలో పుష్ప మూవీ భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో 80 కోట్లకు మేరకు వసూళ్లు రాబట్టింది.
అటు థియేటర్లలోనే కాకుండా… ఓటీటీలోనూ పుష్ప హావా కొనసాగుతుంది. దక్షిణాది భాషల్లో పుష్ప సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే హిందీలో మాత్రం రిలీజ్ కాలేదు. హిందీలో అనుహ్యమైన స్పందన రావడంతో కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ఈనెల 7న పుష్ప ఓటీటీలోకి వచ్చింది. ఇక హిందీ వెర్షన్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఇక సంక్రాంతితో పుష్ప రన్ పూర్తవుతుందట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. రష్మిక మందన్న హిరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు. పుష్ప సినిమానే కాదు.. అందులోని పాటలు కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఒక్క పాట అనే కాకుండా… అన్ని సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న , పెద్ద తేడా లేకుండా పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు.
ట్వీట్..
The ? is going to burn brighter! Watch #PushpaOnPrime in Hindi, Jan 14@alluarjun #FahadhFaasil @iamRashmika @Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi @actorbrahmaji @aryasukku @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/BsKosSy7RA
— amazon prime video IN (@PrimeVideoIN) January 10, 2022
Also Read: Akhanda Movie: జై బాలయ్య ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హల్చల్..
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..