Janhvi kapoor: పుష్ప సినిమాను చూసిన శ్రీదేవి కూతురు.. బన్నీ గురించి ఏం చెప్పిందంటే..

జాహ్నవి కపూర్.. అతిలోక సుందరి  శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరిచయమైంది. అయితే  తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి

Janhvi kapoor: పుష్ప సినిమాను చూసిన శ్రీదేవి కూతురు.. బన్నీ గురించి ఏం చెప్పిందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2022 | 11:24 AM

జాహ్నవి కపూర్.. అతిలోక సుందరి  శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరిచయమైంది. అయితే  తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తన తల్లి లేని లోటు తీర్చడానికి ప్రయత్నిస్తోంది. కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తన ఫిట్ నెస్, డ్యాన్స్ వీడియోలను అందులో షేర్ చేసుకుంటుంది. కాగా ముంబయిలో మళ్లీ కరోనా జూలు విదల్చడంతో ఇంటి దగ్గరే ఎక్కువగా కాలం గడుపుతోందీ అందాల తార. తనకిష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్లను ఆసక్తిగా చూస్తోంది.  ఈక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాను  చూసినట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది.

ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని బన్నీ స్టిల్ ను ఇన్ స్టా రీల్స్ లో షేర్ చేసిన జాహ్నవి ‘ది కూలెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ‘ అని క్యాప్షన్ ఇచ్చింది. అదేవిధంగా ‘మైండ్ బ్లోయింగ్’ అన్న జిఫ్ ఇమేజ్ ను కూడా పోస్ట్ చేసింది. కాగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పుష్ప విడుదలైన సంగతి తెలిసిందే. హిందీలో ఏకంగా  ఇప్పటివరకు 80 కోట్లకు పైగా వసూలు చేసి వంద కోట్లకు పరుగులు తీస్తోంది. రష్మిక మందన నటించిన ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. అదేవిధంగా సుకుమార్ టేకింగ్ స్టైల్ కూడా హిందీ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం  ఆమె  ‘భూల్ భూలయ్యా2’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా  గుడ్‌లక్ జెర్రీ  , మిస్టర్ & మిసెస్ మహి అనే మరోసినిమాకు కూడా ఓకే చెప్పింది.

Also Read: Manchu Lakshmi: పుష్ప సినిమాను వీక్షించిన మంచువారమ్మాయి.. బన్నీ, రష్మిక, సామ్ ల గురించి ఏం చెప్పిందంటే..

Shanmukh: చాలా రోజుల తర్వాత దీప్తి ఫొటోను షేర్ చేసిన షణ్ముఖ్.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

Puppys Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్