AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఆహా సరికొత్త నిర్ణయం..

ఒరిజినల్ సిరీస్, బ్లాక్‌బస్టర్ సినిమాలు అలాగే తెలుగులో ప్రత్యేకమైన కంటెంట్‌తో అలరిస్తోన్న ఆహా ను ఇప్పటికే చాలా మంది ఉపయోగిస్తున్నారు. కాగా తాజాగా అమెరికాలోని తెలుగు విద్యార్థుల కోసం ఓ ప్రత్యేకమైన డిస్కౌంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆహా.

Aha OTT: అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఆహా సరికొత్త నిర్ణయం..
Aha
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2024 | 3:21 PM

Share

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా  సినిమాలు, సిరీస్ లు, టాక్ షోలతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ సినిమాలతో పాటు.. గేమ్ షోలు, టాక్ షోలు అంటూ ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది ఆహా. తాజాగా ఆహా స్టూడెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. ఒరిజినల్ సిరీస్, బ్లాక్‌బస్టర్ సినిమాలు అలాగే తెలుగులో ప్రత్యేకమైన కంటెంట్‌తో అలరిస్తోన్న ఆహా ను ఇప్పటికే చాలా మంది ఉపయోగిస్తున్నారు. కాగా తాజాగా అమెరికాలోని తెలుగు విద్యార్థుల కోసం ఓ ప్రత్యేకమైన డిస్కౌంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆహా. నెలకు కేవలం 4.99 డాలర్స్ లేదా సంవత్సరానికి 24.99 డాలర్స్ ధరతోపాటు ఐదు లాగిన్‌లు అందించనుంది.

సబ్‌స్క్రైబర్‌లు స్టీరియో ఆడియోతో 1080p పూర్తి HD రిజల్యూషన్‌లో కంటెంట్‌ను అందిస్తోంది ఆహా. స్టూడెంట్  ప్లాన్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ వారి యూనివర్సిటీ లేదా కాలేజ్ ఇమెయిల్ IDలను ఉపయోగించి స్టూడెంట్ డిస్కౌంట్ ను పొందొచ్చు .  స్టూడెంట్స్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ‘ఆహా స్టూడెంట్ డిస్కౌంట్’ అమెరికాలోని తెలుగు విద్యార్థులకు వినోదంతో పాటు మరెన్నో విశేషాలను తక్కువ ధరకే అందిస్తుంది. దీని గురించి ఆహా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ మాట్లాడుతూ..

“ఈ విద్యార్థులకు వారి సంస్కృతికి అనుసంధానంగా ఉండటానికి అదేవిధంగా విదేశాలలో వారి విద్యను అభ్యసిస్తున్నప్పుడు అత్యుత్తమ తెలుగు వినోదాన్ని ఆస్వాదించడానికి సరసమైన మార్గాన్ని అందించడమే మా లక్ష్యం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజానికి సేవ చేయాలనేది మా నిబద్ధత. తెలుగు వారు ఎక్కడ ఉన్నా, వారి వారసత్వంతో కొనసాగేలా చూసుకోవాలి, ”అని రాకేష్ అన్నారు. ఆహా ఒరిజినల్‌లు, చలనచిత్రాలు, టాక్ షోలు అలాగే రియాలిటీ సిరీస్‌లతో  ప్రపంచవ్యాప్తంగా విభిన్న అభిరుచులను అందిస్తూ దూసుకుపోతోంది.

Aha

ఆహా 

Aha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us