AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

ఆమె అందమైన రూపం, చలాకీతనం, అద్భుతమైన నటన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. 16 ఏళ్ల వయసులోనే తోపు హీరోయిన్లకు చెమటలు పట్టించింది. అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించారు. కానీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆ తార కేవలం 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీ.

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..
Divya Bharti
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2026 | 8:13 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ 16 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. అందమైన రూపం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని శాసించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ 19 ఏళ్ల వయసులోనే అనుహ్యంగా మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీ అనే చెప్పాలి. ఆమె మరెవరో కాదు దివంగత హీరోయిన్ దివ్య భారతి. ఆమె మరణించడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దివ్యభారతి 1990లో వచ్చిన ‘బొబ్బిలి రాజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ‘అతిలోక సుందరి’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత చిరంజీవి, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

తెలుగులో సాధించిన విజయం ఆమెను బాలీవుడ్‌కు తీసుకెళ్లింది. అక్కడ కూడా తక్కువ కాలంలోనే దాదాపు 14 సినిమాల్లో నటించి, అగ్ర కథానాయికగా ఎదిగారు. ఏప్రిల్ 5, 1993 రాత్రి ముంబైలోని వర్సోవాలో ఉన్న తన ఫ్లాట్‌లో దివ్యభారతి మరణించారు. ఆ రోజు రాత్రి ఆమె తన స్నేహితురాలు, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా , ఆమె భర్తతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో దివ్యభారతి బాల్కనీ అంచున కూర్చుని ఉన్నారని, ఒక్కసారిగా పట్టుతప్పి ఐదవ అంతస్తు నుండి కింద పడిపోయారని సమాచారం. ఆమె కింద పడిన వెంటనే రక్తపు మడుగులో ఉన్న దివ్యను ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా నెట్టేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. ఆ సమయంలో ఆమె భర్త సాజిద్ నడియాడ్‌వాలాపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

సుదీర్ఘ విచారణ తర్వాత 1998లో ముంబై పోలీసులు తగిన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేశారు. ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే రికార్డుల్లో నిలిచిపోయింది. దివ్యభారతి మరణించే సమయానికి ఆమె చేతిలో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె నటించాల్సిన ‘లాడ్లా’ వంటి చిత్రాల్లో తర్వాత శ్రీదేవి నటించాల్సి వచ్చింది. దివ్యభారతి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె నటించిన సినిమాలు, ఆ చిలిపి నవ్వు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

Follow Us