The Kerala Story: థియేటర్లలో షోస్ క్యాన్సిల్.. ఓటీటీలోకి ది కేరళ స్టోరీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
. దేశవ్యాప్తంగా కాక రేపుతోన్న ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో వివాదాలు, షోస్ క్యాన్సిల్ చేస్తుండడంతో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకర్స్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ మే5న థియేటర్లలో విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లవ్ జిహాద్ అంశంపై తెరకెక్కిన ఈ సినిమాపై ఆది నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. మొదట 32 వేల మంది మహిళల యదార్థ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించామని చెప్పుకొచ్చిన డైరెక్టర్ సుదీప్తోసేన్.. ఆ తర్వాత కేవలం ముగ్గురు యువతుల జీవితం ఆధారంగానే సినిమా నిర్మించామన్నాడు. భద్రతాపరమైన కారణాలతో తమిళనాడు, బెంగాల్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రదర్శనలు నిలిపేశారు. రాజకీయ సెగలు రేపుతున్న ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాక రేపుతోన్న ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో వివాదాలు, షోస్ క్యాన్సిల్ చేస్తుండడంతో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకర్స్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే ది కేరళ స్టోరీ డిజిటల్ రైట్స్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 సొంతం చేసుకుంది. ముందుగా ఫిక్స్ చేసుకున్న డేట్ ప్రకారం థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా అంతకన్నా ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయవచ్చని తెలుస్తోంది. ది కేరళ స్టోరీ మూవీని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..