Vidya Balan: ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన విద్యాబాలన్.. మొదటిసారి కెమెరా ముందుకు అప్పుడు వచ్చాను అంటూ..

విద్యాబాలన్.. మల్టీటాలెంటెడ్ హీరోయిన్.. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో స్టార్ హీరోయిన్‏గా ఎదిగింది.

Vidya Balan: ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన విద్యాబాలన్.. మొదటిసారి కెమెరా ముందుకు అప్పుడు వచ్చాను అంటూ..
Vidya Balan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 17, 2021 | 3:17 PM

విద్యాబాలన్.. మల్టీటాలెంటెడ్ హీరోయిన్.. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో స్టార్ హీరోయిన్‏గా ఎదిగింది. కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించింది విద్యాబాలన్. ప్రస్తుతం విద్యాబాలన్ నటించిన లెటేస్ట్ చిత్రం షేర్నీ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మరికొన్ని రోజుల్లో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు విద్యా బాలన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ అరంగేట్రం.. మొదటి సంపాదన గురించి ప్రస్తావించారు.

ఓ టూరిస్ట్ క్యాంపైన్ కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినట్లుగా తెలిపారు విద్యా. తన సొదరి.. మరో కజిన్ ఫ్రెండ్ తో కలిసి టూరిస్ట్ క్యాంపైన్ ఫోటోషూట్ లో పాల్గోన్నట్లుగా చెప్పారు. ఈ ఫోటోషూట్ లో ఓ చెట్టు కింద నిలబడి నవ్వుతూ ఉండాలని.. అలా ఫోటోలకు ఫోజులిచ్చినందుకు వారికి ఒక్కోక్కరికి రూ. 500 చెల్లించినట్లుగా తెలిపారు. అదే నా తొలి సంపాదన అంటూ చెప్పుకోచ్చారు విద్యాబాలన్. ఆ తర్వాత ఓ సీరియల్ ద్వారా మొటిసారి నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినాని.. ఇప్పటికీ ఆ రోజులు తనకు గుర్తున్నాయని చెప్పుకోచ్చారు విద్యా. ఆ సీరియల్ ఆడిషన్స్ కోసం తన తల్లి, సోదరితో కలిసి ఫిల్మ్ సిటీకి వెళ్లానని.. రోజంతా అక్కడే వేచి చూశామని.. దాదాపు అక్కడికి రూ.150 మంది వరకు ఆడిషన్స్ కు వచ్చారని.. వారందరిని చూసి తనకు అవకాశం రాదనుకున్నానని.. కానీ చివరకి అందులో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పుకోచ్చింది విద్యాబాలన్..

Also Read: Heavy rains in Mumbai: ముంబైని వీడని వరణుడు.. భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. వరదనీటితో స్తంభించిన ట్రాఫిక్

International Men’s Health Week: కరోనా బారిన మహిళల కంటె పురుషులే ఎక్కువ పడుతున్నారు..మరణాలూ ఎక్కువే!