Heavy rains in Mumbai: ముంబైని వీడని వరణుడు.. భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. వరదనీటితో స్తంభించిన ట్రాఫిక్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వానలు పడుతున్నాయి

Heavy rains in Mumbai: ముంబైని వీడని వరణుడు.. భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. వరదనీటితో స్తంభించిన ట్రాఫిక్
Mumbai Heavy Rains
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 17, 2021 | 3:03 PM

Heavy rains in Mumbai: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో ముంబైవాసులు అష్టకష్టాలు పడుతున్నారు.

ఆర్థిక రాజధాని ముంబైని వరుణుడు వీడటం లేదు. వారం రోజులుగా తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మరోవైపు నగరంలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే ముంబైతో పాటు నవీముంబై , థానేలో కురుస్తన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాల కారణంగా ఆఫీసులకు వెళ్లే సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటు మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న జనానికి ఈ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పటికీ మోకాలి లోతు నీటిలోనే ఉన్నాయి. హిందూమాత , సియాన్‌ , ఈస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే , చెంబూరు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. కొలాబో ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక, కొంకణ్‌ తీరంలో కూడా సముద్రం అల్లకల్లోలంగా మారింది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు అధికారులు. అరేబియా సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలో వర్షాల కారణంగా చాలా చోట్ల చెట్లు, పాత భవనాలు కూడా కుప్పకూలాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వరదలు రావడంతో జనాలకు కష్టాలు తప్పడం లేదు. ఐతే రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇటు ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యియి. పలు వాహనాలు, ఇళ్లు నీటమునిగాయి. పశ్చిమబెంగాల్‌ కోల్‌కతాను కూడా ముంచెత్తాయి వానలు. గోల్ఫ్‌ గ్రీన్‌ ఏరియా నీటమునిగింది. అక్కడ ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది ఐఎండీ.

Read Also…  TS Monsoon update: తెలంగాణలో మరో 48 గంటల పాటు తేలికపాటి వర్షాలు..