Fire Breaks: బాణాసంచా కార్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు..

Cracker Factory Fire: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌ దహనులోని బాణాసంచా తయారీ కార్మాగారంలో

Fire Breaks: బాణాసంచా కార్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు..
Fire Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 17, 2021 | 2:31 PM

Cracker Factory Fire: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌ దహనులోని బాణాసంచా తయారీ కార్మాగారంలో గురువారం పేలుళ్లు సంభవించాయి. విశాల్ ఫైర్ వ‌ర్క్స్ కంపెనీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో భారీ విస్పోటనం సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో కార్మికులు ఉన్న‌ారని జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించినట్లు పాల్ఘర్ కలెక్టర్ కార్యాలయం పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే.. ఈ పేలుడు శ‌బ్దాలు 15 నుంచి 20 కిలోమీట‌ర్ల మేర వినిపించిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఫ్యాక్ట‌రీలోని ర‌సాయ‌నాలు పెద్దఎత్తున ఉండటంతో.. భారీ పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Also Read:

Joker Malware: ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ‘జోక‌ర్‌’ ప్రమాదం.. హ్యాక‌ర్స్ బారిన ప‌డ‌కుండా ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

Drugs: ఉద్యోగం వదిలి ప్రియుడితో డ్ర‌గ్స్ వ్యాపారం.. క్రైమ్ క‌థా చిత్రాన్ని త‌ల‌పిస్తోన్న శ్రీకాకుళం యువ‌తి జీవితం..