AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇంటివద్ద బాంబు కేసు…..300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ అరెస్ట్

గత ఫిబ్రవరిలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసుకు సంబంధించి ముంబై మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం అరెస్టు చేశారు.

అంబానీ ఇంటివద్ద బాంబు కేసు.....300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్  శర్మ అరెస్ట్
Nia Arrests Ex Encounter Sp
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 17, 2021 | 3:40 PM

Share

గత ఫిబ్రవరిలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసుకు సంబంధించి ముంబై మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. అంతకుముందు అంధేరీలోని ఈయన ఇంటిలో మూడు గంటలపాటు వారు సోదాలు చేశారు.కారు విడి భాగాల ఆటో డీలర్ ..బిజినెస్ మన్ కూడా అయిన మాన్ సుఖ్ హీరేన్ మర్డర్ కేసులో ఈయన ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఇదివరకే అరెస్టు చేశారు. వాజే -ప్రదీప్ శర్మ ఇద్దరూ మంచి స్నేహితులని తెలిసింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పాపులర్ అయిన ప్రదీప్ శర్మను గతంలో రెండు సార్లు ఎన్ఐఏ విచారించింది. 1983 లో ముంబై పోలీసు శాఖలో ఎస్ఐగా జాయిన్ అయిన ఈయన ముంబై అండర్ వరల్డ్ కు సంబంధించి 300 కి పైగా ఎన్ కౌంటర్లు చేశాడట.. వీటిలో 113 ఎన్ కౌంటర్లు ఈయన పేరిటే ఉన్నాయి.

2019 లో సర్వీసు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న శర్మ.. శివసేన పార్టీలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాలా సోపర నియోజకవర్గం నుంచి ఇదే పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఈ కేసులో మరికొందరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈయనను అధికారులు అరెస్టు చేశారు. అటు-ఇదే కేసులో మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈనెల 21 వరకు పోలీసు కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. సచిన్ వాజే.. పోలీసు కానిస్టేబుల్ వినాయక్ షిండేలను ఖాకీలు ఇంకా విచారిస్తున్నట్టు తెలిసింది. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన వాహనం గత ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రికి, సచిన్ వాజేకి మధ్య 100 కోట్ల వసూళ్ల వ్యవహారానికి సంబంధించిన వార్తలు హాట్ హాట్ టాపిక్ వార్తలుగా మారాయి. .

మరిన్ని ఇక్కడ చూడండి: Hansika: వివాదంలో హాన్సిక సినిమా.. ‘మహా’ మూవీ రిలీజ్ ఆపాలని పిటిషన్.. దర్శకుడికి షాకిచ్చిన హైకోర్టు..

Corona virus: కరోనా కల్లోలానికి దేశంలో అనాధలుగా మారిన 30 వేలమందికి పైగా చిన్నారులు