Corona virus: కరోనా కల్లోలానికి దేశంలో అనాధలుగా మారిన 30 వేలమందికి పైగా చిన్నారులు

Corona virus: దేశంలో కరోనా అడుగు పెట్టినప్పటి నుంచి సెలబ్రెటీలు, సామాన్యులు కోవిడ్ బాధితులుగా మారిపోయారు. ఎందరో ఆత్మీయులను కోల్పోయారు. అయితే కరోనాతో తల్లిదండ్రులు..

Corona virus: కరోనా కల్లోలానికి దేశంలో అనాధలుగా మారిన 30 వేలమందికి పైగా చిన్నారులు
Coroona
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2021 | 3:31 PM

Corona virus: దేశంలో కరోనా అడుగు పెట్టినప్పటి నుంచి సెలబ్రెటీలు, సామాన్యులు కోవిడ్ బాధితులుగా మారిపోయారు. ఎందరో ఆత్మీయులను కోల్పోయారు. అయితే కరోనాతో తల్లిదండ్రులు మరణించగా చాలా మంది చిన్నారులు అందాలుగా మిగిలిపోయారు. ఈ చిన్నారుల వివరాలను సుప్రీం కోర్టుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) సమర్పించింది. 30 వేలకుపైగా చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరినీ కోల్పోయారని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.

2020 లో కరోనా మన దేశంలో కేరళలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి రకరకాల వేరియంట్స్ తో ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ కరోనా కారణంగా 30 వేలకు పైగా చిన్నారులు తల్లిదండ్రులకు దూరమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు వివరాలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) సుప్రీంకోర్టుకు సమర్పించింది. కరోనాతో అనాథలైన చిన్నారులకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు కాగా.. వారి వివరాలను ఎన్సీపీసీఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

అధికారిక లెక్కల ప్రకారం భారత దేశంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జూన్‌ వరకు 3,621 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు కాగా, 26,176 మంది తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయారు. వీరిలో 15,620 మంది బాలురు ఉండగా, 14,447 మంది బాలికలు ఉన్నారు. ఎక్కువగా 8-13 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు 11,815 మంది తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరినీ కోల్పోయారని కమిషన్‌ నివేదికలో వెల్లడించింది. .కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అత్యధికంగా మహారాష్ట్రలో (7,084) ఉన్నట్లు ఎన్‌సీపీసీఆర్‌ తెలిపింది.

Also Read: అమ్మ మాటలనుఁ గుర్తు చేసుకున్న సోను సూద్.. రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే