Sonu Sood: అమ్మ మాటలనుఁ గుర్తు చేసుకున్న సోను సూద్.. రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Sonu Sood:  కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్ డౌన్ వరకు అతనొక నటుడు. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలని నిలట్టిన ముద్దుల తనయుడు .. తాను చేయాలనుకున్న సేవకు..

  • Publish Date - 3:00 pm, Thu, 17 June 21
Sonu Sood: అమ్మ మాటలనుఁ గుర్తు చేసుకున్న సోను సూద్.. రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు
Sonusood Ias

Sonu Sood:  కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్ డౌన్ వరకు అతనొక నటుడు. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలని నిలట్టిన ముద్దుల తనయుడు .. తాను చేయాలనుకున్న సేవకు రాజకీయ రంగులు అద్ధకుండా నిస్ఫక్షపాతంగా కుల, మత, వర్గ, బేధాల ప్రసక్తి తలెత్త కుండా అందర్నీ ఆకట్టుకుంటున్నారు సోనూ సూద్. ఈయన చేసే సాయంపై వస్తున్న వార్తలను వినకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సోనూ ప్రధాని కావాలని అంటూ కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్జ్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులతో కలిసి బతికినప్పుడే జీవితంలోని వాస్తవాలు తెలుసి వస్తాయని అన్నారు. అవసరంలో ఉన్న వారికి, మన అవసరం ఉన్నవారికి సాయం చేయడంకన్నా పెద్ద పదవి లేదని తెలిపారు. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు అనుక్షణం గుర్తు పెట్టుకుంటాను. పిడికిలి తెరిచి చూడా.. నీ చేతి గీతల్లో ఎవరో ఒకరికి సాయం చేయాలని రాసి ఉందో అని ఆమె అనేవారు.

అదే నేను చేస్తున్నా. నా చేతిలో వీరందరికీ సాయం చేయాలని రాసి ఉంది అని అన్నారు. నేను నా సేవల్ని కొనసాగిస్తూనే ఉంటా.. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వంటి వాటితో నాకు సంబంధం లేదు. నేనో దారిని ఎంచుకున్నా.. ఎవరేమనుకున్నా ఆ దారిలో నేను వెళుతుంటా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మీపై వచ్చే మీమ్స్‌పై ఎలా స్పందిస్తారు అని అడిగితే.. ఆ మధ్య ఒకరు మద్యం దుకాణానికి తీసుకెళ్లమని అడిగారు. అందుకు సమాధానంగా దుకాణానికి మీరు వెళ్లండి. తాగి పడిపోతే మిమ్మల్ని ఇంటికి చేరవేస్తాను అని చెప్పా. ఇలా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్‌‌కు నేనే స్వయంగా రిప్లై ఇస్తా. అది చూసి వాళ్లు హాయిగా నవ్వుకుంటారు. మా అమ్మ లిటరేచర్ ప్రొఫెసర్. అందుకే నాకు రాయడం తెలుసనీ చెప్పారు సోను సూద్.

అంతేకాదు తనకు రాజకీయాలు అంటే అంతగా ఇష్టం ఉండదని.. ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడైతే ఓ సామాన్యుడిలా ప్రతి గల్లీలోకి, కచ్చా రోడ్ల మీదకి కూడా వెళ్లగలను. రాజకీయాల్లోకి రావాలి అని బలంగా అనిపించినప్పుడు వస్తానేమో. ఇప్పుడైతే అలాంటి ఆలోచన అస్సలు లేదని అన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని అడిగితే.. అన్ని రాష్ట్రాలు నావే. తనకు తనకు దేశమంతా ఒకటే అని అన్నారు సోను సూద్

Also Read: టాలీవుడ్ లో రకుల్ ని రీప్లేస్ చేస్తున్న రష్మిక, పూజ హెడ్గే.. ఒక్క హిట్ చాలు ఇండస్ట్రీని ఏలడానికి అంటున్న ఫ్యాన్స్