టాలీవుడ్ లో రకుల్ ని రీప్లేస్ చేస్తున్న రష్మిక, పూజ హెడ్గే.. ఒక్క హిట్ చాలు ఇండస్ట్రీని ఏలడానికి అంటున్న ఫ్యాన్స్ 

Rakul Preeti Singh: టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ..రకుల్ ప్రీతి సింగ్ దక్షిణాదిలో స్టార్ హీరయిన్. తెలుగు, తమిళ, కన్నడ హిందీ భాషల్లో నటిస్తూ.. మంచి నటిగా పేరు..

టాలీవుడ్ లో రకుల్ ని రీప్లేస్ చేస్తున్న రష్మిక, పూజ హెడ్గే.. ఒక్క హిట్ చాలు ఇండస్ట్రీని ఏలడానికి అంటున్న ఫ్యాన్స్ 
Rakul
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2021 | 2:40 PM

Rakul Preeti Singh: టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ..రకుల్ ప్రీతి సింగ్ దక్షిణాదిలో స్టార్ హీరయిన్. తెలుగు, తమిళ, కన్నడ హిందీ భాషల్లో నటిస్తూ.. మంచి నటిగా పేరు ఫేమ్ తెచ్చుకుంది పంజాబీ సుందరి. తాజగా కెరీర్ లో వెనుకబడిందా అంటే.. అవును అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు చాయిస్ గా మారారు.. పూజ హెగ్డే, రష్మిక లు. దీంతో ఈ ఇద్దరి హీరోయిన్లతో పోలిస్తే.. రకుల్ డిమాండ్ బాగా తగ్గిందని ఫిల్మ్ నగర్ లో టాక్. రకుల్ కంటే.. కూడా పూజ కు రష్మిక కు ఎక్కువ రెమ్యునరేషన్ .. అందరికీ అందుబాటులో ఉన్నా రకుల్ ఎందుకు స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు ఛాయిస్ అవలేకపోతుంది అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న రకుల్ మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్ల సొంతం చేసుకుంది. తర్వాత ఇంటర్ చదువుతున్న సమయంలోనే పాకెట్ మనీ కోసం ఓ కన్నడ సినిమాలో నటించి తొలిసారిగా మేకప్ వేసుకుంది. అలా   2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్‌ కోసం 2013 వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.  ఇంటర్ తో మొదలైన వెండి తెరపై జర్నీ..  డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కంటిన్యూ చేసింది.

తెలుగులో  కెరటం సినిమాతో అడుగు పెట్టింది. అనంతరం సందీప్ కిషన్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లో నటించింది. ప్రతి పైసా కౌంట్ అంటూ.. తోలి సక్సెస్ అందుకుంది.  చిన్న సినిమాలతో  భారీ కెరీర్‌ మొదలు పెట్టిన ఢిల్లీ భామ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే స్థాయికి వచ్చింది. అన్ని బాషలకంటే తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే  టాలీవుడ్‌ జనాలు రకుల్‌కు సింహాసనం వేసి కూర్చోబెట్టారు.

బ్రూస్‌ లీ సినిమాలో రామ్‌ చరణ్‌తో జోడి కట్టిన రకుల్ వెంటనే ఎన్టీఆర్‌ సరసన నాన్నకు ప్రేమతో సినిమాలో అలరించింది. ధృవ, సరైనోడు సినిమాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంది. ధృవ తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చినా సక్సెస్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఒక్క రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడ్డాయి.

ముఖ్యంగా నాగార్జున సరసన రకుల్‌ నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కావటంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ హిందీ తమిళ సినిమాలతో రకుల్ బిజీగానే ఉంది.నటిగా బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ గా సాగిపోతున్న రకుల్ మంచి క్రీడాకారిణి కూడా.. రకుల్ కెరీర్‌ ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోయినా ఒక్క హిట్ పడితే మరోసారి బాక్సాఫీస్‌ను ఏలేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

Also Read: ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం ఓ లెక్కా అంటున్న ఓ యువతి..ఒంటి కాలితో సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..