Hansika: వివాదంలో హాన్సిక సినిమా.. ‘మహా’ మూవీ రిలీజ్ ఆపాలని పిటిషన్.. దర్శకుడికి షాకిచ్చిన హైకోర్టు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది హాన్సిక. ఈ మూవీ తర్వాత హాన్సికకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది.

Hansika: వివాదంలో హాన్సిక సినిమా.. 'మహా' మూవీ రిలీజ్ ఆపాలని పిటిషన్.. దర్శకుడికి షాకిచ్చిన హైకోర్టు..
Hansika Mahaa
Follow us

|

Updated on: Jun 17, 2021 | 3:38 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది హాన్సిక. ఈ మూవీ తర్వాత హాన్సికకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. అయితే కొంతకాలంగా హాన్సిక పేరు పెద్దగా వినిపించడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఈ బ్యూటీ నుంచి సినిమా రాలేదు. చివరిసారిగా సందీప్ కిషన్ సరసన తెనాలి రామకృష్ణ సినిమాలో నటించింది. అయితే ఇటీవల హన్సిక నటించిన రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్ వేదికగా సూపర్ హిట్ సాధించాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హాన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ మహాలో నటిస్తోంది. జమీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హార్రర్ అంశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా వివాదంలో చిక్కుకొని హైకోర్టు వరకు వెళ్లింది. దర్శకుడు జమీల్ స్వయంగా మహా సినిమా విడుదల ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అయితే కోర్టులో కూడా డైరెక్టర్ జమీల్ కు చుక్కెదురు అయ్యింది. మహా మూవీ నిర్మాతలతో మాట్లాడుకున్న రెమ్యునరేషన్ లో పది లక్షలు ఇంకా పెండింగ్ ఉందని.. అది పూర్తిగా చెల్లించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని డైరెక్టర్ పిటిషన్ వేసాడు. అయితే జమీల్ ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి త్రోసిపుచ్చారు. సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి హక్కులు నిర్మాత ముత్తలగన్ కే ఉంటాయని తెలిపింది. ఈ విషయంలో రిట్ పిటిషన్ దాఖలు చేయాలనీ చెప్పింది. ఈ విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. ఈ మూవీ విడుదల తేదీతోపాటు.. ట్రైలర్ కూడా రిలీజ్ కూడా త్వరలోనే ఇవ్వనున్నట్లుగా ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు.

Also Read: Vidya Balan: ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన విద్యాబాలన్.. మొదటిసారి కెమెరా ముందుకు అప్పుడు వచ్చాను అంటూ..

Heavy rains in Mumbai: ముంబైని వీడని వరణుడు.. భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. వరదనీటితో స్తంభించిన ట్రాఫిక్

International Men’s Health Week: కరోనా బారిన మహిళల కంటె పురుషులే ఎక్కువ పడుతున్నారు..మరణాలూ ఎక్కువే!

Latest Articles