Varasudu: ఓటీటీలోకి దళపతి విజయ్ సినిమా.. వారసుడు స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..
వారసుడు సినిమాను డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించగా.. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. రెండు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో వారసుడు ఒకటి. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. కన్నడ బ్యూటీ రష్మిక ముందన్నా జంటగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 11న తమిళంలో విడుదల కాగా.. జనవరి 14న తెలుగులో రిలీజ్ అయ్యింది. అటు తమిళంలోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించగా.. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. రెండు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం.
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ మూవీని థియేట్రికల్ రన్ అనంతరం నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారట. తర్వలోనే స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్ , ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాతోపాటు.. అజిత్ కుమార్ నటించిన తునీవు చిత్రం కూడా ఒకే రోజున విడుదలైంది. మరోవైపు ఈ సినిమా సైతం మంచి వసూళ్లు రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.