రాజ్ తరుణ్‌తో నిత్య లవ్ స్టోరీనా..?

రాజ్ తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 16 నుంచి ప్రారంభం కానుంది. షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే రాజ్ తరుణ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా తెరకెక్కించే కొత్త రకం లవ్ స్టోరీకి రాజ్ […]

  • Ravi Kiran
  • Publish Date - 6:24 am, Fri, 10 May 19
రాజ్ తరుణ్‌తో నిత్య లవ్ స్టోరీనా..?

రాజ్ తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 16 నుంచి ప్రారంభం కానుంది. షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే రాజ్ తరుణ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా తెరకెక్కించే కొత్త రకం లవ్ స్టోరీకి రాజ్ తరుణ్ ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నిత్యామీనన్ నటించనుంది. కథ పరంగా వయసులో హీరోయిన్ కన్నా హీరో చిన్న అని తెలుస్తోంది. వీరి వయసులోని తారతమ్యాలను బట్టే దర్శకుడు వీరిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారక ప్రకటన వెలువడుతుందట.