ఆకట్టుకుంటోన్న ‘సెవెన్’ ట్రైలర్

హవీష్ హీరోగా ప్రముఖ కెమెరామేన్ నైజర్ షఫీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సెవెన్’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రహ్మాన్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసే ఓ యువకుడి కథే ఈ సినిమాకు నేపధ్యమని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం […]

ఆకట్టుకుంటోన్న 'సెవెన్' ట్రైలర్
Ravi Kiran

|

May 10, 2019 | 1:20 PM

హవీష్ హీరోగా ప్రముఖ కెమెరామేన్ నైజర్ షఫీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సెవెన్’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రహ్మాన్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసే ఓ యువకుడి కథే ఈ సినిమాకు నేపధ్యమని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu