AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: అప్పుడే షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. షారుఖ్‌ సినిమా కోసం

Nayanthara- Shah Rukh Khan: ఇటీవల తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara). జూన్‌ 9న తమిళనాడులోని..

Nayanthara: అప్పుడే షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. షారుఖ్‌ సినిమా కోసం
Nayanthara
Basha Shek
| Edited By: |

Updated on: Jun 28, 2022 | 7:03 AM

Share

Nayanthara- Shah Rukh Khan: ఇటీవల తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara). జూన్‌ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో ఘనంగా పెళ్లిపీటలెక్కారీ క్యూట్‌ కపుల్‌. తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆపై థాయ్‌లాండ్‌కు హానీమూన్‌ వెళ్లిన ఈ నూతన దంపతులు తిరిగి వచ్చారు. కాగా హానీమూన్‌ నుంచి వచ్చిరాగే నయన్‌ షూటింగ్‌ సెట్‌లో అడుగు పెట్టిందట. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న జవాన్‌ మూవీ కోసం ముంబైలో వాలిపోయిందట. ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) జోడిగా నటిస్తోంది.

కాగా వివాహం అనంతరం సినిమా షూటింగ్‌లకు కాస్తా బ్రేక్‌ ఇస్తుందని అంత అనుకున్నారు. అంతేకాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్‌ ఇస్తుందని, కొత్త ప్రాజెక్ట్స్‌కు కూడా నయన్‌ కొత్త కండిషన్స్‌ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇలా హఠాత్తుగా షూటింగ్‌ సెట్‌లో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జవాన్‌ సినిమాను కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం నయనతార దాదాపు 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనితో పాటు నయన్‌ తెలుగులో చిరంజీవి సరసన గాడ్‌ ఫాదర్‌ సినిమా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us