AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Prices: మొబైల్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?

మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ ధరలను పెంచగా.. త్వరలో వొడాఫోన్ ఐడియా కూడా పెంచనుంది. జియో, ఎయిర్‌టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. దీంతో ఆ నెట్ వర్క్ సిమ్ వాడేవారికి త్వరలో భారం తప్పదు.

Venkatrao Lella
|

Updated on: Apr 24, 2026 | 5:58 PM

Share
మొబైల్ ఫోన్లు వాడేవారికి షాకింగ్ న్యూస్. రీఛార్జ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలను ఆమాంతం పెంచగా.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలను ఒక్కసారిగా పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత పెంచుతారు..? ఎప్పటినుంచి పెంచుతారు? అనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నామమాత్రంగానే పెంచుతామని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది.

1 / 5
ఎయిర్‌టెల్ ఇప్పటికే రీఛార్జ్ ధరలను పెంచగా.. వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టింది. ఎయిర్‌టెల్ ఇటీవల టారిఫ్ ధరలను 4 నుంచి 5 శాతం పెంచింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే మొత్తంలో పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లపై అదనపు భారం పడనుందని చెప్పవచ్చు. వొడాఫోన్ ఐడియా ఎంత పెంచుతుందనేది చూడాలి.

2 / 5
అయితే ఈ ఏడాది రీఛార్జ్ ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ ఉపయోగించేవారిపై అదనపు భారం పడనుంది. దాదాపు ఈ ఏడాది 15 శాతం మేర రీఛార్జ్ ధరలను కంపెనీలు పెంచే అవకాశముందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. 15 శాతం అంటే మొబైల్ యూజర్లుకు ఈ ఏడాదిలో పెద్ద షాక్ తగలనుందని చెప్పవచ్చు. దీంతో సామాన్యులకు ఇది గుడిబండగా మారనుంది.

3 / 5
ఎయిల్‌టెల్ పాపులర్ రీచార్జ్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ల ధరలు పెరిగాయి. ఇప్పటివరకు రూ.859కి లభించే రీఛార్జ్ ప్లాన్ ఏకంగా రూ.899కి చేరుకుంది. దీంతో అదనంగా రూ.50 భారం యూజర్లపై పడనుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకండానే ఎయిర్‌టెల్ ధరలను పెంచింది.

4 / 5
ఇక వొడాఫోన్ ఐడియా స్పల్ప మొత్తంలోనే పెంచుతామని తెలిపింది. ఈ కంపెనీలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. ఈ విషయాన్ని సీఈఓ అభిజిత్ కిశోర్ ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ పనితీరుపై తాము నమ్మకంతో ఉన్నామని, సబ్ స్కైబర్ల సంఖ్య మరింత పెరిగిందని అన్నారు. మార్చిలో లక్షల కొత్త సబ్‌స్కైబర్లు వచ్చినట్లు స్పష్టం చేశారు.

5 / 5
Follow Us