AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: కోర్టులో హాజరుకానున్న మంచు హీరోలు.. కారణం ఏంటంటే

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు అండ్‌ సన్స్‌ ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరు కానున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి మోహన్‌ బాబు, ఆయన తనయులు విష్ణు, మనోజ్‌లు పాదయాత్రగా కోర్టుకు వెళ్లనుండడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Mohan Babu: కోర్టులో హాజరుకానున్న మంచు హీరోలు.. కారణం ఏంటంటే
Manchu Mohan Babu, Vishnu,
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2022 | 10:58 AM

Share

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు(Mohan Babu)అండ్‌ సన్స్‌ ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరు కానున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి మోహన్‌ బాబు, ఆయన తనయులు విష్ణు, మనోజ్‌లు పాదయాత్రగా కోర్టుకు వెళ్లనుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. మోహన్‌ బాబు, ఆయన తనయులైన సినీ హీరోలు విష్ణు, మనోజ్‌పై 2019 మార్చి 22న కేసు నమోదైంది. విద్యార్థుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసు పెట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యా నికేతన్‌ విద్యార్థులతో కలిసి మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లు రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లంఘిస్తూ ధర్నా చేసినందుకు చంద్రగిరి పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై శ్రీ విద్యా నికేతన్‌ అధినేతగా నిరసన తెలిపారు మోహన్‌ బాబు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని నిలదీశారు. శ్రీవిద్యా నికేతన్ విద్యా సంస్థల ముందు విద్యార్థులు, సిబ్బందితో కలిసి మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌ బైఠాయించారు. దీంతో తిరుపతి-మదనపల్లి హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీనిపై అప్పటి ఎంపీడీవో, ఎంసీసీ టీమ్ అధికారి హేమలత చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారుల నుంచి కానీ పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి కానీ ముందస్తు అనుమతి లేకుండా ధర్నా చేశారని పేర్కొన్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌తో పాటు శ్రీ విద్యా నికేతన్‌ విద్యా సంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వో సతీష్‌లపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 290, 341, 171 (ఎఫ్‌) రెడ్‌ విత్‌ 34 సెక్షన్లతో పాటు పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 34 కింద కేసులు పెట్టారు. ఈ కేసుకు సంబంధించే కోర్టుకు హాజరు కానున్నారు మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లు. తిరుపతిలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి కోర్టు వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..