సాలిడ్‌గా ఇస్తానంటోన్న నాని.. డేట్‌ కూడా ఫిక్స్ చేశాడు

వైవిధ్య కథలలో నటించేందుకు ఎప్పుడూ ఆసక్తిని చూపే నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా.. నాని మొదటిసారి ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఉగాది కానుకగా వచ్చే ఏడాది మార్చి 25న ‘వి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన […]

సాలిడ్‌గా ఇస్తానంటోన్న నాని.. డేట్‌ కూడా ఫిక్స్ చేశాడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 04, 2019 | 11:49 AM

వైవిధ్య కథలలో నటించేందుకు ఎప్పుడూ ఆసక్తిని చూపే నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా.. నాని మొదటిసారి ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఉగాది కానుకగా వచ్చే ఏడాది మార్చి 25న ‘వి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. అందులో ‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకు నా క్షమాపణే దిక్కు’’ అన్న షేక్‌స్పియర్ డైలాగ్‌ను పెట్టారు.

ఇక ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన నాని.. ‘‘వయొలెన్స్ కావాలన్నారుగా.. ఇస్తా.. ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా’’ అని కామెంట్ పెట్టాడు. కాగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నివేథా థామస్, అతిథిరావు హైదారీ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది కాగా.. దీనిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.