ఈ నగరానికి ఏమైంది ? ‘ పొల్యూషన్ శాపమా ?’ ఈమె కూడా మాస్క్ ధారిణే !

ఢిల్లీ కాలుష్యంబారిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సైతం పడింది. ప్రస్తుతం తన ‘ ది వైట్ టైగర్ ‘ మూవీ షూటింగ్ ను పురస్కరించుకుని ఈ నగరానికి వఛ్చిన ఈ అమ్మడు… ‘ అబ్బ ! ఈ కాలుష్య భూతాన్ని తట్టుకోలేకపోతున్నాను.. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో షూటింగులో పాల్గొనలేకపోతున్నా ‘ అంటూ ట్వీట్ చేసింది. పైగా ముఖానికి మాస్క్ ధరించి ఉన్న తన ఫోటోని పోస్ట్ చేసింది. ‘ షూట్ డేస్ ఫర్ ది వైట్ […]

ఈ నగరానికి ఏమైంది ? ' పొల్యూషన్ శాపమా ?' ఈమె కూడా మాస్క్ ధారిణే !
Follow us
Anil kumar poka

| Edited By:

Updated on: Nov 04, 2019 | 11:57 AM

ఢిల్లీ కాలుష్యంబారిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సైతం పడింది. ప్రస్తుతం తన ‘ ది వైట్ టైగర్ ‘ మూవీ షూటింగ్ ను పురస్కరించుకుని ఈ నగరానికి వఛ్చిన ఈ అమ్మడు… ‘ అబ్బ ! ఈ కాలుష్య భూతాన్ని తట్టుకోలేకపోతున్నాను.. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో షూటింగులో పాల్గొనలేకపోతున్నా ‘ అంటూ ట్వీట్ చేసింది. పైగా ముఖానికి మాస్క్ ధరించి ఉన్న తన ఫోటోని పోస్ట్ చేసింది. ‘ షూట్ డేస్ ఫర్ ది వైట్ టైగర్.. ఇక్కడ ఇప్పుడు షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అసలిక్కడ ఎలా జీవించాలో అర్థం కావడంలేదు. ఎయిర్ ప్యూరిఫయిర్స్, మాస్కులు మమ్మల్ని రక్షిస్తున్నాయి. ఇళ్ళు లేని నిరాశ్రయుల కోసం ప్రార్థిస్తున్నాను. బీ సేఫ్ ఎవ్వెరీ వన్ ‘ అని ప్రియాంక పేర్కొంది. అంతే కాదు.. ‘ ఎయిర్ పొల్యూషన్..ఢిల్లీ పొల్యూషన్.. వి నీడ్స్ రైట్ టు బ్రెత్ టు ది పోస్ట్ ‘ అని ఆమె హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది. ఇంతేకాదు.. తన ఇటీవలి చిత్రం ‘ ది స్కై ఈజ్ పింక్ ‘ చిత్రం షూటింగ్ సందర్భంగా గత ఏడాది ఎదుర్కొన్న ఇదే రకమైన అనుభవాన్ని ఆమె గుర్తు చేసింది. ప్రియాంకతో బాటు , ఫర్హాన్ అఖ్తర్ కూడా ఆ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రియాంకే కాదు.. మోడల్ లీసా రే కూడా ముఖానికి మాస్క్ ధరించిన తన ఫోటోను పోస్ట్ చేసింది. ఢిల్లీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, చైనా తన కాలుష్యాన్ని తగ్గించుకున్నప్పుడు ఈ దేశ రాజధాని ‘ ప్రక్షాళన ‘ ఎందుకు కావడంలేదని ఆమె ప్రశ్నించింది.