Akhanda: బాలయ్య సినిమాకోసం భారీ ఫైట్..తనదైన స్టైల్లో డిజన్ చేస్తున్న బోయపాటి
నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది... వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ వస్తుంది.. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా
Akhanda: నందమూరి బాలకృష్ణ, బోయపాటి… వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ వస్తుంది.. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే చిత్రయూనిట్ ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక టైటిల్ తోపాటు టీజర్ ను కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమా కోసం ఇటీవలే ఓ భారీ ఫైట్ ను చిత్రీకరించారట. బోయపాటి తనదైన స్టైల్లో ఈ ఫైట్ ఎపిసోడ్ ను డిజైన్ చేయించాడట. తెరపై ఈ ఫైట్ కొత్తగా .. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందట. 15 రోజుల పాటు షూటింగును జరుపుకోనున్న ఈ యాక్షన్ సీన్ ను, ఈ సినిమాకి హైలైట్ ఉండనుందని తెలుస్తుంది. హీరో శ్రీకాంత్ విలనిజం ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆయన అభిమానులను అలరిస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :