నాకు న్యాయం చేయండి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్..

Actor Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కీస్టోన్ సంస్థ తనకు రూ.9 కోట్ల ఆర్థిక లావాదేవీల విషయంలో తమను మోసం చేసిన

  • Rajitha Chanti
  • Publish Date - 5:26 pm, Sun, 18 April 21
నాకు న్యాయం చేయండి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్..
Senior Actor Naresh

Actor Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కీస్టోన్ సంస్థ తనకు రూ.9 కోట్ల ఆర్థిక లావాదేవీల విషయంలో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా నరేష్ విడుదల చేశారు. అందులో నరేష్ మాట్లాడుతూ.. కీస్టోన్ ఇన్‌ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్‌.. స్టోన్‌ ఇన్‌ఫ్రా సహా రెండు, మూడు కంపెనీలు స్టార్ట్‌ చేశారు. మా బిల్డర్‌ ఫినిక్స్‌తో ఈయన అసోసియేట్‌ అయ్యి సైనింగ్ అథారిటీలో ఉన్నారు. ఈయన మా ఫ్యామిలీ దగ్గర ఆరేళ్ల ముందు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. మా మేనమామ రఘునాథ్‌ ద్వారా అప్పు తీసుకున్నారు. ఇన్నేళ్లు మాకు ఎటువంటి రిటర్న్స్‌ కూడా ఇవ్వలేదు. మేం చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి నేను సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కూడా అప్రోచ్‌ అయ్యాను. ఇంతకు ముందు విజయవాడకు తీసుకెళ్లి తప్పించుకున్నాడు. ఇప్పుడు దాదాపు పదికోట్ల రూపాయలకు పైగానే మాకు రావాలి. తెలంగాణ పోలీసులు, సెంట్రల్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌వారు వెంటనే స్పందించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.

 

Also Read: Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..