Pushpa Movie: ఊహించని ట్విస్ట్ లతో ఆకట్టుకోనున్న పుష్ప.. పక్క ప్లాన్ తో రాబోతున్న సుకుమార్

సుకుమార్... మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సరికొత్త కథను సిద్ధం చేస్తున్నాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

Pushpa Movie: ఊహించని ట్విస్ట్ లతో ఆకట్టుకోనున్న పుష్ప.. పక్క ప్లాన్ తో రాబోతున్న సుకుమార్
Pushpa
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2021 | 9:29 AM

Pushpa Movie:

సుకుమార్… మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సరికొత్త కథను సిద్ధం చేస్తున్నాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్‏కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‏గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే వీడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్స్,టీజర్స్ ‏తో ఈ సినిమా పై మరింత హైప్‏ను క్రియేట్ చేశారు మేకర్స్.

అయితే పుష్ప సినిమాలో ట్విస్ట్ అదిరిపోతయట. బన్నీ లారీ డ్రైవర్ గా ఆ గ్యాంగ్ లో చేరడం .. స్మగ్లర్ గా తన కార్యకలాపాలను నిర్వహించడం వెనుక ఒక ఊహించని ట్విస్ట్ ఉందని అంటున్నారు. అలాగే రష్మిక విషయంలోనూ ఓ భారీ ట్విస్ట్ ఉండబోతుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్  నడుస్తుంది. ఇక రష్మిక ఇంటర్వెల్ కి ముందు విలన్ తరఫు మనిషిగా రివీల్ అవుతుందట. విలన్ కి సంబంధించిన ఎకౌంట్స్ ఆమె చూస్తూ ఉంటుందని అంటున్నారు. అయితే ఆమె విలన్ వైపు వెళ్లడం వెనుక ఒక ట్విస్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఇలా భారీ ట్విస్ట్ లతో కథను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడట సుకుమార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నాకు న్యాయం చేయండి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్..

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..

Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌