దేశంలో శ్రీరాముడు కొలువై ఉన్న ప్రసిద్ధ ఆలయాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..

భారతదేశంలో అనేక మంది దేవతలు, దేవుళ్లను కోలుస్తుంటారు. ఇక దేశవ్యాప్తంగా దేవాలయాలు అనేకం. విష్ణువు అవతారంలో రామావతారం ఏడవదిగా చెబుతుంటారు.. మన దేశంలో రాముడు కొలువై ఉన్న ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

  • Rajitha Chanti
  • Publish Date - 10:59 pm, Sun, 18 April 21
1/6
Bhadradri
వెకుంఠరాముడు.. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాచలంలోని పవిత్ర నది గోదావరి నది తీరమున సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు. శ్రీ రాముడు వెలసిన మిగతా ఆలయాల్లో రాముడి మూలవిరాట్టు రెండు చేతులతో మానవుని రూపాన్ని పోలి ఉంటుంది.
2/6
Ayodya
అయోధ్య.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదు జిల్లాకి 6 కి.మీ. దూరంలో సరయు నది తీరంలో అయోధ్య అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ ప్రదేశం 108 దివ్యతిరుపతిలలో ఒకటిగా, శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిగా, మోక్షదాయకమైన సప్తపురములలో అయోధ్యాపురం ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
3/6
Vottimitta
ఒంటిమిట్ట.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉంది. ఇక్కడ ఒకే శిలపైనా శ్రీరాముడు, సీతన, లక్ష్మణుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు.
4/6
Tamilnadu
తమిళనాడు.. తమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో శ్రీ ఆది కుంభేశ్వరాలయానికి దగ్గరగా ప్రసిద్ధమైన రామస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి ఒక పీఠంపై కొలువుదిరి ఉండటం విశేషం అయితే హనుమంతుడు వీణపై స్వామివార్లను స్తుతిస్తూ ఉన్నట్లు విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది.
5/6
Kalarama Temple
కలరామ మందిరం.. మహారాష్ట్ర, నాసిక్ లో కాలరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాలు నల్లరాతితో తయారుచేయబడినవి అందుకే ఈ ఆలయానికి కాలరామ మందిరం అనే పేరు వచ్చినదని చెబుతారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 12 సంవత్సరాల వయసు పట్టిందని పురాణం.
6/6
Rama Temple
అయోద్య
Rama Temple